కాజల్ – చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా.?

అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ కనిపించి వుండేదే.! తొలుత త్రిషని అనుకుని, ఆ తర్వాత త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ని తీసుకొచ్చి, చివరికి కాజల్‌ని కూడా సినిమాలోంచి తీసేశారు.

దర్శకులు కొరటాల శివ, సినిమాలో చిరంజీవికి హీరోయిన్ లేకుండా ఎందుకు చేశాడు.? అన్నదానికి ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదాయె.! హీరోయిన్ లేకపోవడమే మంచిది.. అని కొందరు, హీరోయిన్ వుండి వుండాల్సింది.. అని ఇంకొందరు.. ‘ఆచార్య’ విషయమై ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు.

ఇక, చిరంజీవి తన తదుపరి సినిమా ‘విశ్వంభర’ కోసం త్రిషకి పిలిచి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కూడా అలాగే చిరంజీవి ఛాన్స్ ఇవ్వబోతున్నారా.? అంటే, ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి సినీ వర్గాల్లో.

అయితే, చిరంజీవి చేయబోయే ఇంకో సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందా.? లేదంటే, ‘విశ్వంభర’ సినిమా కోసమే ఏదన్నా స్పెషల్ రోల్‌లో కాజల్‌ని చూపిస్తారా.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

మెగా కాంపౌండ్‌తో కాజల్ అగర్వాల్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా పలువురు మెగా హీరోలతో కాజల్ గతంలో నటించింది.

సినిమాల సంగతెలా వున్నా, మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్ కాజల్ అగర్వాల్‌కి.