
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 70 శాతం రికవరీని సాధించింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ 60 శాతం థియేయర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి. పవన్ సాధించిన ఈ విజయానికి అభిమానులు పొంగిపోతున్నారు. పైగా ఈ చిత్రానికి, ప్రభుత్వానికి మధ్యన పెద్ద రగడే నడుస్తోంది. టికెట్ ధరలు తగ్గించడం, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకపోవడం లాంటి చర్యలతో సినిమా అభిమానుల్లో పంతం మరింత పెరిగింది. సినిమా ఇండస్ట్రీ నుండి పవన్ సినిమాకు మద్దతు ఇవ్వాలని స్టార్ హీరోలను డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఇండస్ట్రీలోని హీరోలు చాలామంది సినిమాను వీక్షించి పవన్ రీఎంట్రీని ఆస్వాదిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం చిత్రాన్ని వీక్షించి పవన్ మీద ప్రశంసలు కురిపించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సినిమాను చూసినట్టు తెలుస్తోంది. సినిమా చూశాక తారక్ మరో మాట లేకుండా పవన్‌ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపాడట. నిజంగా ఇది హర్షించదగిన విషయమే. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఎన్టీఆర్ బయటకు చెప్పకపోయినా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతిని బయటపెట్టారు.
