ఆ సినిమా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న నితిన్ హీరోయిన్.. ఫోటో వైరల్!

జయం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయయ్యారు అందాల నటి సదా. ఆమె నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది. అయితే చాలా కాలం నుండి సదా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ అప్పుడప్పుడు టీవీ షోలలో పాటిస్పేట్ చేస్తూ ప్రేక్షకులకు చేరువలో ఉంది. ఈటీవీలో ప్రసారమౌతున్న ఢీ డాన్స్ షో కి చాలా కాలం జడ్జ్ గా వ్యవహరించింది. సదా ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే టీవీ షోస్ లో కనిపిస్తోంది. ఇటీవల ఈ హీరోయిన్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇటీవల ఈ అమ్మడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మేజర్ ” సినిమా చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు అడవి శేషు ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా విడుదలైప్పటికీ సక్సెఫుల్ గా రన్‌ అవుతోంది. దేశం కోసం మేజర్ సందీప్‌ చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడేలా చేస్తోంది. ఇక యువతలో ఈ సినిమా చూసి ఆర్మీలో చేరాలి అన్న ఆలోచనని కలుగచేసింది. ఈ సినిమా చూసి ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా చూసిన హీరోయిన్ సదా కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. థియేటర్లో సినిమా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక ఈ సీన్‌ను వీడియో తీసిన మేజర్ టీం.. ఆ వీడియోను తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సదా మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ అందరూ మర్చిపోయారు. ఈ సినిమా చూసే సమయంలో అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలామంది చెప్పారు సినిమాలో లాస్ట్ అరగంట సేపు చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని. కానీ నేను ఈ సినిమా చూస్తూ మధ్యలోనే ఏడ్చేసాను. ఈ సినిమా చాల అద్భుతంగా నిర్మించారని మేజర్ సినిమా టీమ్ కి సదా కంగ్రాట్స్ చెప్పింది.