బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన పలు భాషలలో అనేక సినిమాలలో నటించి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన నటుడు . ఈయన ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీలో సినిమాలో నటించడమే కాకుండా పలు రకాల యాడ్స్ లో కూడా నటిస్తూ నిత్యం బిజీగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈయన కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కి కొన్ని సంవత్సరాలుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండియాలో ఉన్న సెలబ్రిటీలలో రిచ్చెస్ట్ పర్సన్స్ లో అమితాబ్ కూడ ఒకరు. ఈయనకి ముంబై లో జూహు లో 5 విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి.
అమితాబ్ తన నటనలో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల అమితాబ్ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఫేస్ బుక్ లో గుడ్ మార్నింగ్ అని పోస్ట్ చేయగా..” ఇది మధ్యాహ్నంరా ముసలోడా ” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చుసిన అమితాబ్ అనూహ్య రీతిలో స్పందించాడు. సోషల్ మీడియాలో తనను అపహాస్యం చేస్తూ కామెంట్ చేసిన నెటిజన్ కి అమితాబ్ కృతజ్ఞతలు తెలియజేశాడు .
ఈ క్రమంలో అమితాబ్ తనని అలా ముసలోడా అని కామెంట్ చేసిన వ్యక్తికి రిప్లై ఇస్తూ.. అర్ధరాత్రి సమయం వరకు షూటింగ్ చేయడం వల్ల ఉదయం లేవటం లేట్ అయింది. అందువల్లే ఇలా లేట్ గా విషెస్ చెప్పాను. మీరు చాలాకాలం బతకాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అంతే కాకుండా మిమ్మల్ని ఎవరు ముసలోడా అని పిలవకూడదని కోరుకుంటున్నా అంటూ అమితాబ్ తన స్టైల్ లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.