ఆ ఒక్క మాటతో మోదీ మనసు దోచేశావ్ జగన్.. ఇంక అడ్డేముంది ??

is chandrababu Naidu again making big mistake

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వంతో స్నేహం ఎలా ఉండాలనే విషయమై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  మొదటిసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన అందరినీ కలుపుకుని వెళితేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని భావించి బీజేపీకి బేషరతుగా మద్దతిస్తున్నారు.  అధికారం చేపట్టిన నాటి నుండి మోదీని ప్రసన్నం చేసుకునేలా వ్యవహరిస్తున్న ఆయన ఎక్కడా కేంద్రానికి ఎదురువెళ్లే పనులేవీ చేయట్లేదు.  ఢిల్లీ నుండి ఫోన్ అంటూ వస్తే అంగీకారం తెలపడం మినహా భేషజాలకు వెళ్లడం లేదు.  ఈ తరహా వ్యవహారశైలి ఒక రకంగా మంచిదే.  అవసరమైనప్పుడు కేంద్రం సహాయం అందుకోవాలంటే ఆమాత్రం సహకారం ఇవ్వాల్సిందే. 

Narendra Modi impressed with YS Jagan's nature
Narendra Modi impressed with YS Jagan’s nature

ఇప్పటివరకు బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్.  రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుండగా భారతీయ జనతా పార్టీకి సొంతగా 87 మంది సభ్యులున్నారు.  మిత్ర పక్షాలతో కలుపుకుంటే ఆ సంఖ్య 101కి చేరుకుంటుంది.  వైసీపీకి రాజ్యసభలో 6గురు సభ్యుల బలం ఉంది.  అందుకే జగన్ అంటే మోదీకి ప్రత్యేక ద్రుష్టి.  అందుకే ఏపీ విషయంలో జగన్ తీసుకునే ప్రతి సంచలన నిర్ణయానికి మోదీ పరోక్షంగా  సహకరిస్తూనే ఉన్నారు.  అందుకు మూడు రాజధానుల బిల్లే సాక్ష్యం.  నిజంగా బీజేపీకి అడ్డుకోవాలనే ఉద్దేశ్యమే ఉంటే ఇతర రాష్ట్రాల్లో చేసినట్టే రాజ్యాంగ వ్యవస్థను మార్చి మరీ అడ్డుకునేది.  కానీ జగన్ తనకు అనుకూలం కాబట్టి మోదీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.  రాజధానుల విషయంలో రాజ్యాంగం పరంగా తమ ప్రమేయం ఉండదని సైలెంట్ అయిపోయారు. 

ఈ చర్యతో జగన్ కు మోదీ పట్ల గౌరవం, నిబద్దత మరింత పెరిగాయి.  అందుకే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎన్నికలో నిలబడిన ఎన్డీయే కూటమి అభ్యర్థి జేడీయూ ఎంపీ హరివంశ్ సింగ్ నారాయణ్ కు మద్దతు తెలపడానికి సిద్దంగా ఉన్నారు.  బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏదో మర్యాదకు ఫోన్ చేసి మద్దతు కోరారు.  జగన్ ఎలాంటి బెట్టూ చేయకుండా ఓకే అనేశారట.  మామూలుగా ఎవరైనా అయితే ఇలాంటి సమయంలో ఇదే అదును అనుకుని ఏవేవో డిమాండ్లు ముందుంచి మాటిస్తేనే మద్దతు అంటారు.  కానీ జగన్ అలా చేయలేదు.  అలాగని ఆయనకు అవసరాలు లేవా అంటే ఉన్నాయి.  పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి అవసరాలున్నాయి.  కానీ ఆయన బెట్టు చేయలేదు.  వాటి గురించి అస్సలు అడగలేదట.  అవన్నీ తర్వాత చూసుకుందాంలే అనుకుని మద్దతు ఇచ్చేశారట.  ఆ విధానమే మోదీకి బాగా నచ్చిందట.   ఈ పరిణామంతో జగన్ పట్ల ఆయన వాత్సల్యం మరింత పెరిగుంటుంది.  అది భవిష్యత్తులో జగన్ కు బాగా ఉపయోగపడుతుంది.