తొందర పడుతున్న నానీ.. పోటీ వద్దనుకుంటున్నాడా?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ఇప్పుడు టైం అంతగా బాగోలేదు. భారీ అంచనాలతో తెరకెక్కిన తన లాస్ట్ రెండు సినిమాలు కూడా ఓటిటి లోనే రిలీజ్ కావడం పైగా రెండు కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రభావం పడేలా చేసింది. కానీ నానీ మాత్రం ఆ అంచనాలకు అతీతంగా అదిరే సినిమాలతో వస్తున్నాడు.

దర్శకుడు రాహుల్ తో చేసిన “శ్యామ్ సింగ్ రాయ్” అయితే ఇపుడు మంచి అంచనాలు నెలకొల్పుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ కే బాలయ్య సినిమా “అఖండ” కూడా వస్తుందేమో అని సినీ వర్గాల్లో టాక్ రాగా ఈ విషయంలో నాని సినిమా యూనిట్ తొందర పడాలని చూస్తున్నట్టు చూస్తున్నారు.

ఆ టాక్ అలా వచ్చిందో లేదో వీరు ఇప్పడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేసి సినిమా రిలీజ్ డిసెంబర్ 24నే అని క్లారిటీ ఇచ్చారు. దీనితో పోటీ వీరు వద్దనే అనుకుంటున్నారు అనిపిస్తోంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ ఇంకా కృతి శెట్టి లాంటి యంగ్ హీరోయిన్లే నటించారు.