ప్రతిష్టాత్మక ‘ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’ లో 11 అవార్డ్స్ ను గెలుపొందిన ‘హాయ్ నాన్న’

అంతర్జాతీయంగా “హాయ్ డాడ్” పేరుతో విడుదలైన మా చిత్రం “హాయ్ నాన్న” ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్‌లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్‌లను కైవసం చేసుకున్నట్లు అనౌన్స్ చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ విశేషమైన విజయం మా తారాగణం, టీం అసాధారణ ప్రతిభను సెలబ్రేట్ చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మా స్టొరీ టెల్లింగ్, యూనివర్సల్ అప్పీల్ ప్రభావాన్ని కూడా చాటుతోంది.

ప్రతిభావంతుడైన నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న”లో అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నేచురల్ స్టార్ నానితో పాటు వెర్సటైల్ మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఇద్దరూ తమ అత్యుత్తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు.

ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో “హాయ్ నాన్న”కి లభించిన ప్రశంసలు చిత్ర యూనిట్ నైపుణ్యానికి నిదర్శనం:

1. ఉత్తమ డ్రామా చిత్రం
2. ఉత్తమ నటుడు
3. ఉత్తమ నటి
4. ఉత్తమ నటన ద్వయం
5. ఉత్తమ బాల నటి
6. ఉత్తమ దర్శకుడు
7. ఉత్తమ స్క్రీన్ ప్లే
8. ఉత్తమ నూతన దర్శకుడు
9. ఉత్తమ సినిమాటోగ్రఫీ
10. ఉత్తమ సౌండ్‌ట్రాక్
11. ఉత్తమ ఎడిటింగ్

దర్శకుడు శౌర్యువ్ తన ఆనందాన్ని పంచుకుంటూ..”ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఇంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందడం గొప్ప అనుభవం. ఇది “హాయ్ నాన్న” ప్రతి అంశంలో చూపించిన కృషి, అంకితభావాన్ని ధృవీకరిస్తుంది. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం తారాగణం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.” అన్నారు

“హాయ్ నాన్న” భారతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.