“RRR” ని గే సినిమా అన్నందుకు అతడికి గ్యాప్ లేకుండా వాయిస్తున్న కీరవాణి.!

ఒక్క మన తెలుగు సినిమానే కాకుండా ఇండియన్ సినిమా అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్(RRR) సినిమాలే అని చెప్పాలి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో నిజ జీవిత విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ లుగా చేసి ఎక్కడో నిలబెట్టాడు దర్శకుడు రాజమౌళి.

ఒకతల్లి కనకపోయిన ఇద్దరు అన్నదమ్ములులా ఉండే వారి స్నేహంని ఎమోషనల్ గా ఓ రేంజ్ లో చూపించిన ఈ చిత్రంపై ఓ ప్రముఖుడు అది కూడా దక్షిణాది సినిమాకి చెందిన టెక్నీషియన్ RRR సినిమా ఒక గే సినిమా అంటూ అవమానకరంగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

దీనితో అభిమానులు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఎప్పుడు చాలా కూల్ గా ఉండే సంగీత దర్శకుడు కీరవాణి మాత్రం సోషల్ మీడియాలో భారీ యుద్ధమే చేస్తున్నారు. తనదైన శైలిలో ఆ కామెంట్ చేసిన అతన్ని పరుషంగానే తిడుతూ ఓ రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.

అది ఇంకా కూడా ఆగలేదు. నీ కళ్ళకి ఈ చిత్రం ఒకలా కనిపించొచ్చు కానీ నాకు మిగతా వారికి ఓ తల్లి తన బిడ్డ కోసం పడే వేదన కనిపిస్తుంది. అందులో రామ్, భీమ్ లు ఎవరూ కనిపించలేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంకా నేను అజయ్ దేవగన్ పాత్ర ఎంతోమందిని వీరులుగా తీర్చి దిద్దే సన్నివేశాలు కూడా చూసాను.

మళ్ళీ మీ సీన్స్ గుర్తు రానందుకు ఎన్టీఆర్, ఆలియా రామ్ చరణ్ లు నన్ను క్షమించండి అంటూ రివర్స్ ట్రోల్స్ గట్టిగా వేశారు. నా ఫోన్ లో కొన్ని అక్షరాలు తప్పుగా పడిపోతున్నాయి. ఇప్పుడు అంతా సెట్టయ్యింది అంటూ తెలిపారు. దీనితో ఈ ట్వీట్లు అన్నీ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/mmkeeravaani/status/1544472847342780416?s=20&t=KnvrdQBCzwnNpeX-HQHw9A

https://twitter.com/mmkeeravaani/status/1544470930788798465?s=20&t=KnvrdQBCzwnNpeX-HQHw9A

https://twitter.com/mmkeeravaani/status/1544469984830636032?s=20&t=KnvrdQBCzwnNpeX-HQHw9A