సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి?

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం ఉదయం స్వర్గస్తులైన విషయం తెలిసింది. ఈమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కి కూడా అయింది. కృష్ణంరాజు మరణ వార్త నుంచి ఇంకా బయటపడకనే ఇంద్ర దేవి మరణ వార్త అందరిని కృంగదీసింది.ఈ క్రమంలోనే ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున మహేష్ ఇంటికి చేరుకొని ఆమెకు నివాళులు అర్పించారు. ఇకపోతే మహేష్ ఇంటికి నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు వంటి హీరోలు కూడా వెళ్లి మహేష్ బాబుని కృష్ణని పరామర్శించారు.

ఇకపోతే బుధవారం గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అనంతపురం రావాల్సి ఉన్న నేపథ్యంలో కృష్ణ ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేస్తూసూపర్ స్టార్ కృష్ణ గారికి సోదరుడు మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె మరణ వార్త పై స్పందించారు. ఫ్రీ రిలీజ్ వేడుక పూర్తి చేసుకున్న అనంతరం నేడు మెగాస్టార్ చిరంజీవి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఇంటికి చేరుకున్నటువంటి చిరంజీవి కృష్ణ గారితో అలాగే మహేష్ బాబుతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇందిరాదేవికి నివాళులు అర్పించడానికి రాలేకపోయినటువంటి మెగాస్టార్ చిరంజీవి నేడు మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణను కలిసి పరామర్శించారు.