Mega Family: అల్లు వారసులతో భారీగా పోటీ పడుతున్న మెగా వారసులు… దేనికంటే?

Mega Family: సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అల్లు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా లేదా వ్యాపారానికి సంబంధించిన ఏ విషయం అయినా కూడా అందులో అల్లు అరవింద్ ప్లాన్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ విధంగా మెగా అల్లు కుటుంబానికి పెద్దదిక్కుగా అల్లు అరవింద్ ఉన్నారు.అయితే ప్రస్తుతం వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత రెండు కుటుంబాల మధ్య భారీ పోటీ ఏర్పడింది.ఈ రెండు కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వారసులుగా రామ్ చరణ్ అల్లుఅర్జున్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించగా అందుకు పోటీగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించారు. ఇక అల్లు అరవింద్ ముగ్గురు కుమారులు కూడా వివిధ బిజినెస్ రంగాలలో తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారపరంగా అల్లు కుటుంబం ముందడుగులో ఉంది.ఇక రామ్ చరణ్ కూడా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రొడక్షన్ హౌస్ స్థాపించాడు అదేవిధంగా ఎయిర్ లైన్స్ బిజినెస్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా రామ్ చరణ్ కూడా పలు వ్యాపారాలను ప్రారంభిస్తూ వ్యాపార రంగంలో అల్లు కుటుంబానికి పోటీగా నిలుస్తున్నారు. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా చిరంజీవి ఇద్దరు కూతుర్లు కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వ్యాపార రంగంలో అల్లు వారసులతో మెగా వారసులు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీలో ఒకటిగా ఉన్న ఈ కుటుంబం మధ్య ఇలాంటి పోటీ ఏర్పడటంతో అభిమానులు సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు.