గంటసేపు హగ్ చేసుకుంటే 7 వేలు వసూలు చేస్తున్న బ్రిటన్ వ్యక్తి..

అదేంటి హాగ్ చేసుకుంటే 7 వేలు వసూలు చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తమ మనసులోని భావాలు ఇతరులతో పంచుకోలేక ఒంటరిగా ఆ బాధను భరిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్ బ్రిస్టల్ కు చెందిన ట్రెజర్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు.

అలా ఒంటరి వ్యక్తులు అతడిని సంప్రదించి ఇంటికి రాగానే వారిని కౌగిలించుకొని.. వారు చెప్పింది వింటాడు. ఇక తల నిమురుతూ వారి ఆందోళన తగ్గేలా చేస్తాడు. ఇక దీనికి కూడా ఒక పేరు ఉండగా ఆ పేరు కడల్ థెరఫీ. ఇక ఇలా చేసినందుకు గంటకు 7,000 తీసుకుంటాడట ఆ వ్యక్తి.