Naga Babu: టాలీవుడ్ నటుడు మెగా బ్రదర్ నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే. ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరొకవైపు విలన్ గా కూడా కొన్ని కొన్ని సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు నాగబాబు. మొన్నటి వరకు బుల్లితెరపై ప్రసారమయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఆ తర్వాత నెమ్మదిగా షోలకు దూరమైన విషయం తెలిసిందే. పలు కామెడీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న నాగబాబు మరోపక్క తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి అలాగే మెగా ఫ్యామిలీ గురించి చేసే ట్వీట్స్ పై కూడా తన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు నాగబాబు. ఇకపోతే తాజాగా ఆయన యమధీర అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇటు సినిమాలు, అటు రాజకీయాలలో ఎప్పుడు బిజీగా ఉండే నాగబాబు తన ఫిట్నెస్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో తన ఫిట్నెస్ విషయంలో బాగా ఫోకస్ పెట్టారు నాగబాబు. ఎప్పటికప్పుడు జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు.
ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా కండలు పెంచేస్తున్నాడు ఈ మెగా బ్రదర్, తాజాగా జిమ్ లో తన కండలు చూపిస్తూ వర్కౌట్ చేస్తున్న ఒక భారీ కటౌట్ ఫోటోని పోస్ట్ చేసారు చిన్నగా ప్రారంభించండి, స్థిరంగా ఉండండి.. మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు అని గుర్తుంచుకోండి.. అంటూ ఒక క్యాప్షన్ ని కూడా జోడించారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తుండగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం గత కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ అల్లు ఫాన్స్ మధ్య జరుగుతున్న ఫ్యాన్స్ వార్ ని మనసులో పెట్టుకొని నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఈ వయసులో అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా కామెంట్ చేసే వారికి మెగా అభిమానులు దీటుగా కామెంట్ రిప్లై ఇస్తున్నారు.