నీకోసం ఏదైనా చేస్తానంటున్న బేబీ హీరోయిన్.. బర్త్డే విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్!

సోషల్ మీడియా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ ని సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ నటి.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.

బేబీ చిత్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ కి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వైష్ణవి కి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ సరసన జాక్ మూవీ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గానే ఉంటుంది ఈ భామ.

ఈ క్రమంలోనే తాజాగా తన తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది వైష్ణవి. అందులో మోస్ట్ అమేజింగ్ తమ్ముడు నితీష్ కి హ్యాపీ బర్త్డే, నాకోసం అన్ని చేస్తున్నందుకు థాంక్స్, ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. నన్ను మోటివేట్ చేస్తున్నావ్ నీ ప్రేమ, కేరింగ్ తో రోజుని పరిపూర్ణం చేస్తావు. నా జీవితంలో అద్భుతాన్ని నువ్వే, నువ్వు లేకుండా నేను ఒక రోజును కూడా ఊహించలేకపోతున్నాను.

ఎవరు చూసుకోలేనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావు, నువ్వే నా బలం. నీకోసం నేను ఏదైనా చేస్తాను మాటల్లో చెప్పలేను కానీ లవ్ యు అని రాసుకొచ్చింది దాంతో పాటు తమ్ముడు తో కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది వైష్ణవి చైతన్య. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి కాగా నెటిజన్స్ సైతం వైష్ణవి చైతన్య తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఫోటోలలో అక్క తమ్ముళ్లు ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.