అందుకే ఆ సన్నివేశాల్లో బాగా నటించేదాన్ని.. నిత్యామీనన్ వైరల్ కామెంట్స్!

కొంతమంది హీరోయిన్స్ సినిమాలు చేసినా, చెయ్యకపోయినా వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు. అలాంటి వాళ్లలో ఒకరు నటి నిత్యమీనన్. నాని హీరోయిన్ గా నటించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తరువాత తనదైన స్టైల్ లో ఎన్ని సినిమాలు చేసిందో అందరికీ తెలిసిందే. రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేస్తూ మంచి నటి అనిపించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ కి, పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.

తాజాగా ఆమె తమిళ చిత్రం తిరుచిత్రంబళం సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఇటీవల జరిగిన 70 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది.
కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న నిత్యమీనన్ సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనకు అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకున్నాను, ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు.

తర్వాత కథల ఎంపిక విధానాన్ని మార్చుకున్నాను, నటనకి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు ఎంచుకున్నాను. నటన అనేది భావోద్వేగానికి సంబంధించినది దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. మనం చేసే పాత్రలపై మనకి పూర్తి విశ్వాసం ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి లేదంటే ఆ ప్రభావం చేసే పాత్రలపై పడుతుంది. కెరియర్ కొత్త రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని, అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలలో సులభంగా నటించేదాన్ని.

ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం చాలా కష్టంగా ఉంది, బహుశా నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానేమో అని చెప్పుకొచ్చింది నిత్యమీనన్. ఇక ఆమె తాజాగా తెలుగులో కూడా ఒక సినిమాలో నటించబోతుంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఒక కీలక పాత్ర చేయబోతుంది. చాలా రోజుల తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.