నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి సురేష్ మహానటి మూవీతో జాతీయ స్థాయిలో స్టార్ హోదాని అందుకుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి పీటలెక్క బోతుంది. గతంలో పలుమార్లు ఈమె పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రూమర్స్ పుట్టుకొచ్చాయి, ఇప్పుడు కూడా అలాంటి రూమరే అనుకున్నారు నెటిజెన్స్. కానీ కీర్తి సురేష్ పెళ్లి నిజమే అని ఆమె చిరకాల మిత్రుడు యాంటోనీ తటిల్ తో కీర్తి సురేష్ ఏడడుగులు వేయబోతుందని..
డిసెంబర్ 11న గోవాలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ఆమె తండ్రి, నిర్మాత అయిన జి సురేష్ కుమార్ మలయాళం లో ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి గోవా తో పాటు కేరళలో కూడా జరిపేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఇక వరుడు అంటోనీ తటిల్ విషయానికి వస్తే అతను కేరళలోని కొచ్చి కి చెందిన వ్యక్తి.
దాదాపు దశాబ్దం కాలం నుంచి దుబాయిలో వ్యాపారాలు చేస్తూ మంచి బిజినెస్మేన్ గా ఎదిగాడు. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నప్పటికీ ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల అంగీకారంతోని పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేది అనే చిత్రాల్లో చేస్తుంది. అలాగే బేబీ జాన్ మూవీ తో త్వరలో బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.
క్రిస్మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.అయితే బాలీవుడ్ ఎంట్రీ తో గ్లామర్ హద్దులు చెరిపేసినట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కి వరుణ్ ధావన్ కి మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా కీర్తి సురేష్ కి పెళ్లి అనేసరికి ఆమె ఫ్యాన్స్ కి కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మిస్సింగ్ ఎమోజిస్ తో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.