Pushpa : “పుష్ప” ఇక్కడ పుంజుకుంటున్నాడట!ఎంతవరకు నిజమో?

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మారుస్తూ వచ్చిన లేటెస్ట్ సినిమా “పుష్ప”. టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న మొదటి ఆట తోనే మిక్సిడ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాపై హైప్ తో మొదటి రోజు భారీ వసూళ్లు ఖాయం అయ్యాయి.

కానీ మరోపక్క ఈ సినిమా అన్ని భాషల్లో పెర్ఫామెన్స్ కోసం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ అయ్యింది. మరి వీటిలో హిందీ రిలీజ్ అల్లు అర్జున్ కి ప్రత్యేకం. అయితే దీనిపైనే పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. హిందీ సినిమా ట్రాకర్స్ కొంతమంది ఈ సినిమాని లేపడానికి బాగానే ట్రై చేస్తున్నారు.

మొదట చాలా తక్కువ మందే సినిమాకి వస్తున్నారని చెప్పినా నెమ్మదిగా సాయంత్రం షో నుంచి “పుష్ప” పుంజుకుంటున్నాడని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. కొంతమంది అయితే ఇవన్నీ పైడ్ వ్యూస్ అని హిందీలో పుష్ప సినిమా తేలిపోయింది అని పెదవి విరుస్తున్నారు. అసలు హిందీలో పుష్ప మిస్టరీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి మరి.