అయ్యో పాపం! కేటిఆర్ కి మెంటలెక్కిస్తున్న తెలంగాణ మీడియా నిర్వాకం

KTR clash with telangana media

ఎన్నికల వేళ చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవటంతో పాటు.. కొత్త తలనొప్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందునా రాజ్యాంగపరమైన సంస్థల విషయాల్లో వేళ్లు..కాళ్లు దూర్చినట్లుగా వచ్చే వార్తల కలిగించే చికాకులు అన్ని ఇన్ని కావు, తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు మంత్రి కేటీఆర్.

KTR clash with telangana media
KTR clash with telangana media

త్వరలో గ్రేటర్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన సందడి అల్రెడీ మొదలైంది. గడిచిన కొద్ది రోజలుగా మంత్రి కేటీఆర్ మహా ఉత్సాహాన్ని ప్రదర్శించటమే కాదు.. అంతా తానై అన్నట్లు నడిపిస్తున్నారు. ఫ్యూచర్ సీఎంగా అందరూ అనుకుంటున్న ఆయన గ్రేటర్ ఎన్నికలతో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు.. ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్న ఆయన.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అదే సమయంలో.. ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందన్న మాటకు ఆయన నవంబరు 11 తర్వాత వచ్చే వీలుందన్న మాట చెప్పినట్లుగా సమాచారం. కేటీఆర్ తో భేటీ అన్న వెంటనే మీడియా అలెర్టు కావటం.. సమావేశంలో ఏం మాట్లాడారన్న విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు దూకుడును ప్రదర్శించారు.

ఇన్ కెమేరా మీటింగ్ లో మాట్లాడుకున్న ప్రైవేటు సంభాషణల్ని అధికారిక సమాచారం అన్నట్లుగా భావిస్తూ.. నవంబరు 11 తర్వాత గ్రేటర్ ఎన్నికలు అన్న మాటను మంత్రి కేటీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా భారీగా కవర్ చేశారు. మీడియా దూకుడు మంత్రి కేటీఆర్ కు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. ఎందుకంటే.. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఇలాంటి ప్రకటనలు చేయటం తప్పు కావటమే కాదు.. ఈసీ కన్నెర్రకు గురి కావాల్సి వస్తుంది. మరొక అంశం.. తాను అధికారికంగా ఎక్కడా చెప్పని మాటల్ని.. తన పేరిట చెప్పటంతో అలెర్టు అయిన కేటీఆర్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నవంబరులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయని.. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండో వారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను అన్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు. అంతే కాదు.. ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని.. సదరు మీడియా సంస్థలు తాను అనని మాటల్ని తాను అన్నట్లుగా అపాదించటాన్ని తప్పు పట్టారు. మొత్తానికి మీడియా దూకుడు కేటీఆర్ కు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.