Konda Surekha: కొండ సురేఖ ఇంట్లో ఇటీవల జరిగిన పార్టీ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోలో భాగంగా కొండా సురేఖ మరో యువతీతో మాట్లాడుతూ తన ఇంట్లో ఈరోజు దావత్ జరుగుతోందని బిర్యానితో పాటు బీర్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎవరు ఎక్కువగా ఈ వేడుకలో డాన్స్ చేస్తే వారికి బీర్లు అంటూ ఈ సందర్భంగా కొండ సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా ఈమె మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో కొండా సురేఖకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో కొందరు దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో ఇలా లిక్కర్ దావత్ జరగడం ఏంటి? అసలు అధికారులు ఏం చేస్తున్నారు ఇంట్లో సోదాలు నిర్వహించాలని అసలు అది ఫ్యామిలీ పార్టీనా లేకపోతే రేవ్ పార్టీనా అంటూ ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలా కొండ సురేఖ ఇంట్లో జరిగిన పార్టీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో కొండా సురేఖ కుమార్తె స్పందించారు.
ఈ సందర్భంగా కొండ సురేఖ కుమార్తె సోషల్ మీడియా వేదికగా తన తల్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మా అమ్మ ఇంట్లో జరిగిన పార్టీ పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అని తెలిపారు.. నా కూతురు పుట్టిన రోజు కావడంతో మా అమ్మ ఎంతో సంతోషంగా తన స్టాఫ్ అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఇచ్చారని తెలిపారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ పార్టీపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదేమీ రేవ్ పార్టీ కాదని అక్కడ ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ, అక్రమ పూరితమైన మద్యం కానీ లేదు.. బహిరంగగా ఏర్పాటు చేసినదే.. కావున కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ఇక కొండ సురేఖ ఈ వీడియోలో ఈ పార్టీ అఫీషియల్ అంటూ తెలిపారు. ఇక అనఫీషియల్ అంటూ ఆమె ఆగిపోవడంతోనే ఈ పార్టీ గురించి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలా ఈ పార్టీ గురించి వస్తున్న వార్తలపై ఆమె కుమార్తె క్లారిటీ ఇచ్చారు.