Karthika Deepam – Hima: బుల్లితెర టీవీ ఛానల్ స్టార్ మా’లో ప్రసారమయ్యే సీరియల్స్ లో అత్యంత ఆదరణ పొందిన సీరియల్స్ లో కార్తీక దీపం నెంబర్ వన్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకుల లోగిళ్ళలోకి ఈ సీరియల్ దూసుకెళ్ళి పోయింది. అందులోని క్యారెక్టర్స్ తోనే ప్రేమలో పడి పోయారు ఆడియన్స్. దీప, డాక్టర్ బాబు, సౌందర్య, మౌనిత ఇలా ప్రతి ఒక్క పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అందుకే ఏళ్లకేళ్లు సాగుతున్న కూడా అలాగే చూస్తున్నారు. పైగా రేటింగ్ పరంగా వంటలక్క టాప్ లో ఉంది. కనీసం ఆ దరిదాపుల్లో కూడా వేరొక సీరియల్ రావడం లేదంటే ఏ మాత్రం క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈ సీరియల్ లో నటించే నటీనటులు అందరు కూడా పరిచయస్తులే. ముఖ్యంగా నటించిన దీప కూతురు హిమ కూడా బాగా పాపులర్ అయింది. దాంతో చిన్నారికి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది సోషల్ మీడియాలో. హిమ అసలు పేరు సహృద. ఈమె చిన్నప్పటి నుంచి సీరియల్స్ చేస్తూనే ఉన్నప్పటికీ కార్తీకదీపం మాత్రం చాలా క్రేజ్ ను తీసుకొచ్చింది.
ఇకపోతే సీరియల్లో అందంగా చూపించరని తెలిసినప్పుడు మొదట చాలా బాధ పడిందట హిమ. అంతేకాకుండా మొదట్లో కెమెరా అంటే భయం అని, మేకప్ అంటే ఇష్టమే ఉన్నా ఎందుకో మొదట్లో నచ్చడం నచ్చలేదని చెప్పింది. ఈ చిన్నారి ఆ నలుపు మేకప్ చూసి తనకు నచ్చకపోయినా సీరియల్ నిర్వాహకులకు ఇచ్చిన మాట కోసం చేశానని చెప్పింది హిమ. కానీ ఆ పాత్ర తనకు ఎంతో నచ్చింది. అని సీరియల్ కథ కూడా ఎంతో బాగుందని కొన్ని విషయాలు పంచుకుంది సహృద.
హిమకు కొన్ని విషయాలు మొదట నచ్చకపోయినా అంతా అర్థమయ్యాక అందులో లీనమైపోయింది ఈ చిన్నారి సహృద. హిమ ఈ సీరియల్ లైఫ్ లోనే కాదు నిజజీవితంలోనూ అనేక కష్టాలను ఎదుర్కొంది. చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరం అయింది. ఈ విషయాన్ని ఓ స్టేజ్ షోలో హిమ తల్లి వేదికపై చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సహృద చిన్న వయసులో ఉండగానే ఆమె తండ్రి ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఆమెను వదిలి వెళ్ళిపోయాడట. సహృదని, ఆమె తల్లిని పట్టించుకోకుండా విడిచి పెట్టాడట. ఆ తర్వాత ఆమె బాధ్యతను ఆ తల్లే తీసుకుందని ఒక టీవీ కార్యక్రమంలో తన కన్నీటి గాధను బయటపెట్టారు.