బాబుపై నందమూరి కుటుంబం నుంచి మరో సంచలన స్టేట్మెంట్.!

Kalyan Ram Also Gave Statement On Chandra Babu Naidu | Telugu Rajyam

తెలుగు దేశం పార్టీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు అతని కుటుంబంలోని మహిళను కించపరిచేలా ఏపీ అధికార పార్టీ వారు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబం నుంచి వచ్చిన హీరోలు నందమూరి హీరోలు కూడా తమ ఆగ్రహారోరిత స్పందనను వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య తో పాటు ఇప్పుడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ముద్నుకొచ్చి అధికారిక స్టేట్మెంట్ ఇచ్చాడు. ” అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట అనేది ఎంతో బాధాకరం.

ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచు కోవాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే పూజ్యులు తాతగారు రామా రావు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్క సారి గుర్తుచేసుకుందాము.” అని ఈ ప్రెస్ నోట్ లో తెలిపాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన భారీ సినిమా “బింబిసారా” రిలీజ్ కానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles