jayyanna patrudu: తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వైసీపీ మంత్రులపై మండిపడ్డాడు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్క చేయడం లేదన్న విషయం సమాజం మొత్తం చూసిందని అన్నాడు. జగన్ ను ఆయన తల్లి, చెల్లి, బావా చీ కొట్టి పక్క రాష్ట్రానికి వెళ్లడం కంటే పెద్ద చీత్కారం ఏముంటుంది వీసా రెడ్డి అంటూ వెటకారంగా ప్రశ్నించాడు.
అంతేకాకుండా త్వరలో నీకు రాజ్యసభ, జగన్ కు ముఖ్యమంత్రి పదవి పోతుందని గట్టిగా తేల్చి చెప్పాడు. ఇక జాబ్ మేళాలో ముందు జాగ్రత్త చర్యగా మీరు ఉద్యోగాలను రిజర్వ్ చేసుకోవాలి అని అన్నాడు. కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహించడం కాదని.. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి అని గట్టిగా తెలిపాడు.