ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని చాటి చెప్పిన “ఆర్ఆర్ఆర్” సినిమా పై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాని ఒక గే లవ్ స్టొరీ అంటూ వ్యాఖ్యానించాడు. అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ డైరెక్టర్ మునీష్ భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ అనే ఒక చెత్త సినిమాను 30 నిమిషాల పాటు చూసాను అని ట్వీట్ చేస్తే.. రసూల్ రీట్వీట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ ఒక గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ పై ప్రముఖ టాలివుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.
శోభు యార్లగడ్డ ఈ విషయంపై స్పందిస్తూ…” RRR సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను భావించడం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు RRR సినిమా ఒక గే లవ్ స్టోరీనే అనుకుంటే.. దాంట్లో తప్పేముంది? అసలు నువ్వు దాన్నెలా సమర్థించుకుంటావు? నీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి నీచమైన కామెంట్ రావడం నిజంగా శోచనీయం” అంటూ శోభు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. శోభు ట్వీట్ కి రసూల్ రియాక్ట అవుతూ..మీరు చెప్పినదాన్ని ఒప్పుకుంటున్నాను. RRR సినిమా ఒక గే లవ్ స్టొరీ అయినప్పటికీ తప్పు ఏమీ లేదు. కానీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాన్ని నా ఫ్రెండ్ కు కోట్ చేసాను తప్ప ఇంకేమీ లేదు.మీరు దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు.నేను దీన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
అయితే ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో RRR సినిమా పై మీరు చేసిన వ్యాఖ్యలతో మీ రెస్పెక్ట్ పోయింది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరు విప్లవకారుల కథతో రూపొందిన ఈ సినిమాని అవమానించడం వల్ల రసూల్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మన తెలుగు సినిమాని అవమానించినందుకు రసూల్ ని టాలీవుడ్ ఫిలిం మేకర్ ఎవరు ప్రోత్సహించవద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు పుష్ప సినిమా కోసం పనిచేసిన రసూల్ ని ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం మేకర్స్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.