బ్యాచులర్ పార్టీ గురించి నాగ చైతన్య బోల్డ్ కామెంట్స్..వైరల్ అవుతున్న కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నాగచైతన్య తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. సమంత నుండి నాగ చైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ విడిపోయిన తర్వాత వారి జీవితాల్లో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాగచైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చాలా బిజీగా ఉన్నాడు. సమంతకు దూరమైన తర్వాత నాగచైతన్య నటించిన సినిమాలు కూడా మంచి హిట్ అవుతున్నాయి.

ఇటీవల విడుదలైన బంగార్రాజు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా రాశిఖన్నా నటించింది. జులై 22 న సినిమా విడుదలకు సిద్దంగా ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో నాగ చైతన్య, రాశి ఖన్నా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాపిడ్ క్వశ్చన్స్ అంటూ కొన్ని ప్రశ్నలు అడిగింది.

ఈ క్రమంలో బ్యాచిలర్ పార్టీస్‌లో ఎక్కువగా జరిగే మూడు విషయాల గురించి చెప్పాలని యాంకర్ ప్రశ్న వేసింది. ముందుగా రాశీ ఖన్నా సమాధానం చెబుతూ ఇంకేముంది డ్రింక్ చేయడం, ఆ తర్వాత డాన్స్, ఫన్ అని చెప్పింది. అదే ప్రశ్నని యాంకర్ నాగచైతన్యని కూడా అడిగింది . కానీ చైతన్య చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. బ్యాచిలర్ పార్టీల్లో బట్టలు ఉండవు..బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. అంతేకాకుండా ఎవరూ నిద్రపోరు ఒకవేళ ఎవరైనా నిద్ర పోయినా మిగిలిన వారు నిద్రపోనివ్వరు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు. బ్యాచిలర్స్ పార్టీ గురించి నాగచైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నాగచైతన్య చెప్పిన దాంట్లో తప్పేముంది అంటే కొందరు కామెంట్స్ చేస్తున్నారు.