నాకు ఆ పిచ్చి ఏమాత్రం లేదు… షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పిల్లి!

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో దీపికా పిల్లి ఒకరు.యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం యాంకర్ గా బుల్లితెరపై ఓరేంజ్ లో సందడి చేస్తున్నారు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటున్నారు.ఈ విధంగా వరుస కార్యక్రమాలతో ఎంతో సందడి చేస్తున్న దీపికా పిల్లి వీకెండ్ పార్టీలో పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన ఈమె అక్కడ ఫోన్ పట్టుకొని కనిపించడంతో ఏకంగా తన ఫ్రెండ్ దీపిక ఫోన్ పిచ్చిది అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ కామెంట్ పై ఈమె స్పందిస్తూ నాకు ఫోన్ పిచ్చి ఏమాత్రం లేదు నేను అలాంటి దాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో యాంకర్ రష్మితో కలిసి మెంటర్ గా ఢీ షోలో సందడి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోయినా ప్రస్తుతం ఈమె కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా దీపిక పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా పొట్టి దుస్తులలో ఈమె స్టేజ్ పై చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో శేఖర్ మాస్టర్ తో కలిసి ఓ రేంజ్ లో డాన్స్ చేశారు. ఇకపోతే తాజాగా పార్టీ చేద్దాం పుష్ప అనే స్పెషల్ ఈవెంట్ లో కూడా ఈమె రొమాంటిక్ సాంగ్ కి సోలో పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. ఇలా బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె సుధీర్ విష్ణు ప్రియ వంటి తదితరులు నటిస్తున్న వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటిస్తున్నారు.