వారెవ్వా ..జగన్ అంటే ఇది..కార్పొరేట్ దందాకు చెక్

Jagan Telugu Rajyam

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అనే విషయం, ఇప్పుడిప్పుడే ఆంధ్ర ప్రదేశ్ జనాలకు అర్ధమవుతుంది. గత నేతల మాదిరి సినిమా గ్రాఫిక్స్, సింగపూర్ కబుర్లు చెప్పకుండా ఉన్నంతలోనే ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ జగన్ ముందుకి సాగుతున్నాడు.

Jagan Telugu Rajyam

 

రాష్ట్రంలో విద్య వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొనిరావాలని జగన్ ఆలోచిస్తున్న విషయం తెలిసిందే, అందులో భాగంగా అమ్మఒడి పథకం పెట్టి మొదటిగా పిల్లలు స్కూల్ కి వెళ్లే విధంగా చేశాడు . ఆ తర్వాత మెల్లమెల్లగా రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో నాడు నేడు అనే కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రవైట్ స్కూల్స్ కి ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. అన్నటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగీష్ మీడియం ప్రవేశ పెడుతున్నాడు. కోర్టు లో ఎవరెన్ని కేసులేసిన కానీ, ఇంగ్లీష్ మీడియం పెట్టాలనే ఆలోచనతోనే జగన్ పనిచేస్తున్నాడు. జగనన్న విద్యాదీవెనతో యూనిఫామ్, బ్యాగ్, షూస్, పుస్తకాలు.. అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. అంగన్వాడీలను పూర్తిగా నర్సరీ స్కూల్స్ గా మారుస్తున్నారు.

  ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది విద్య రంగం కోసం కేటాయించిన నిధులు 22,604 కోట్ల రూపాయలు. గతేడాది కాలంలో 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు ప్రవేటు స్కూల్స్ నుండి ప్రభుత్వ పాఠశాలకు మారినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జాగ్రత్తల నడుమ ప్రభుత్వ సెక్టార్ లో 9 ,10 తరగతులు ప్రారంభం అయ్యాయి. వీటికి తోడు ఈ ఏడాది అమ్మఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తారనే ప్రచారం ఒకటి బాగా జరుగుతుంది. దీనితో అనేక మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొత్తగా దాదాపు లక్ష మంది అడ్మిషన్లు తీసుకున్నారు. మున్ముందు ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ని వసతులు కల్పిస్తూ కార్పొరేట్ విద్య విధానానికి ఏ మాత్రం తీసిపోకుండా రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలను కాదని అధిక పీజులు వసూళ్లు చేస్తూ, ర్యాంకుల కోసం పిల్లలను మానసికంగా వేధించే కార్పొరేట్ స్కూల్స్ లో తమ పిల్లలను చదివించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఈ పరిణామాలన్ని కార్పొరేట్ విద్య సంస్థలకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య ఎప్పుడైతే సామాన్య జనాలకు అందుబాటులోకి వస్తాయో అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లు.