AP: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…. త్వరలోనే నిరుద్యోగ భృతి.. అర్హతలు ఇవే?

AP: ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సూపర్ సిక్స్ అంటూ కొన్ని హామీలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించే అధికారంలోకి వచ్చారు. ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది.

గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయడంతోనే పథకాలను అమలు చేయడానికి వీలుకావడం లేదని చెప్పుకు వస్తున్నారు అయితే ఈ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిరుద్యోగ భృతి కూడా ఒకటి. ప్రతి నెల 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబోతున్నట్లు వెల్లడించారు అయితే తాజాగా ఈ పథకం గురించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని అందుకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఇలా ప్రతినెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి పొందాలి అంటే అర్హతలు ఏంటి అనే విషయాలను కూడా వెల్లడించారు. నిరుద్యోగ భృతి అందుకొని యువతకు 22 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే నెలకు పదివేల రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదు. డిగ్రీ లేదా ఏదైనా డిప్లమా కోర్సులను పూర్తి చేసిన వారి నుంచి ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.

ఈ పథకానికి అర్హులైన వారు కేవలం ఆంధ్రప్రదేశ్ చెందినవారై ఉండాలి. అభ్యర్థి లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండరాదు వారు ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక ఈ పథకానికి అనర్హులు. అభ్యర్థి మరి ఇతర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందకూడదు. ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే వారు నిరుద్యోగ భృతి పథకానికి అనర్హులనీ తెలిపారు. ఇలా ఎన్నో అర్హతలను తెలియజేస్తూ ఈ అర్హతలు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించబోతున్నట్లు తెలియజేశారు అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం.