Varun Sandesh: తన భార్య వితిక అంటే తనకు చాలా గౌరవం ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ అన్నారు. కానీ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక మాత్రం కొన్నిసార్లు తాను చాలా బాధ పడిందని ఆయన చెప్పుకొచ్చారు. అందులో చూపించిన విధానం, ఎడిటింగ్ పైన ఆమె చాలా బాధ పడిందని వరుణ్ తెలిపారు. ఇకపోతే వితిక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక తనకు కొందరు తనకు అసభ్యంగా మెసేజెస్ పెట్టారని వరుణ్ సందేశ్ అన్నారు. అవి తనకు కూడా చూపించిందని, దానికి తాను చాలా బాధ పడ్డానని ఆయన చెప్పారు.
ఐనా ఒక మనిషిని ఒక గంట చూసి వాళ్ళ క్యారక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. తను కూడా బయటికి వచ్చాక ఆ మేసేజెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిందని ఆయన అన్నారు. అసలు వాళ్ళను ఏమని తిట్టాలో కూడా అర్దం కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజం చెప్పాలంటే తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని, నిజంగానే సూపర్ ఉమెన్ అని వరుణ్ అన్నారు. ఇప్పుడు వితిక ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. అది కూడా చాలా సక్సెస్ గా రన్ అవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎమోషనల్ సపోర్ట్ ఐనా, మెంటల్ సపోర్ట్ ఐనా తనే ఎక్కువ ఇస్తుందని ఆయన చెప్పారు. అప్పర్ హ్యాండ్, లోయర్ హ్యాండ్ అని ఎవరూ లేరని ఇద్దరిదీ ఒకే మాట అని వరుణ్ సందేశ్ స్పష్టం చేశారు..