అసలే ఉత్తరాంధ్ర అన్ని రకాలుగాను బాగా వెనుకబడిన ప్రాంతం. విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు ఫార్మారంగం పరంగా బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. పారాశ్రామికంగా ఆ రెండు జిల్లాలు దశాబ్ధాలగా అభివృద్ధి పథంలోనే నడుస్తున్నాయి. ఇలా పోలిక చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఈ రెండు జిల్లాలకంటే, అలాగే రాష్ర్టంలో మిగతా జిల్లాల అన్నికంటే బాగా వెనుకబడిన జిల్లా ఏదైనా ఉందంటే? అది శ్రీకాకుళం జిల్లానే. ఎంత మంది ప్రధానులు మారినా…ఎంతమంది రాష్ర్ట ముఖ్యమంత్రులు మారినా శ్రీకాకుళం జిల్లా మాత్రం అభివృద్దికి ఏనాడు నోచుకోలేదు. అభివృద్ధి కి 100కి అడుగుల దూరంలోనూ..దరిద్రానికి బాగా దగ్గర్లోనూ మగ్గిపోతున్న జిల్లా అది.
నాయకులంతా రాజకీయంగా జిల్లాను వాడుకున్నారు తప్ప! ప్రజల సమస్యల్ని తీర్చిన నాయకులు గాని, వాళ్లని ఉద్దరించిన నేతలు గానీ లేరు. రాతియుగం, ద్వాపర యుగాల్ని దాటి కలియుగంలో బ్రతుకుతున్నా! శ్రీకాకుళం జిల్లా మాంత్రం అభివృద్దిలో ఇంకా రాతియుగంలోనే ఉంది. అందుకు నిదర్శనం! ఇప్పటికీ ఆ కాలం నాటి సంప్రదాయాలు కొనసాగడంగా చెప్పొచ్చు. తాజాగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఆ జిల్లా వాసుల్ని కలవరపెడుతుంది. లోక్ సభ స్థానం ప్రాతిపదికన ఆ జిల్లాను విభిజిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అభివృద్ది చెందిన, శాసనసభ నియోజకవర్గాలైన ఎచ్చెర్ల, రాజాం ప్రాంతాలు విభజన జరిగితే విజయనగరం జిల్లాల్లో కలిసిపోతే శ్రీకాకుళం అంతకంతకు వెనక్కి వెళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు నియోజక వర్గాల్ని వదులుకోమని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే వైకాపా నేతలతో కలిసి పోరాటం చేస్తామని ఆ జిల్లా టీడీపీ నేతలు హెచ్చరించడం మరో విశేషం. ఇప్పటికే ఆ జిల్లా వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తన నిర్ణయాన్ని మర్మగర్భంగా చెప్పేసారు. విభజిస్తే రాజకీయంగా వెనుకబడిబోతామని, ఆ జిల్లాకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి ఈ అభ్యంతరాలు అన్ని చేరనున్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నేతలు తుదిగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏర్పాటు జరిగితే గనుక సోంపేట తరహా మరో ఉద్యమం శ్రీకాకుళంలో జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని స్థానిక గ్రామాల వాసులు హెచ్చరిస్తున్నారు.
సోంపేటలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంకల్పించారు. ఈ నేపథ్యంలో బలవంతంగా పచ్చని పోలాలు లాక్కునే ప్రయత్నం జరిగింది. అదే జరిగితే తమ ఉనికినే కోల్పోతామని భావించిన సోంపేట ప్రజానీ కం ప్రభుత్వంపై తిరగబడింది. ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈనేపథ్యంలో పోలీసుల తూటాలకు కొందరు అమరులయ్యారు. పచ్చని పోలాలు రక్తసిక్తమైన సంగతి తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. కానీ స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో అప్పట్లో రెండు ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. మళ్లీ సోంపేటలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనని ఏ ప్రభుత్వం చేయలేదు.