Health Tips: కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. అందువలన దీనిని తినడానికి చాలా మంది ఆసక్తి కనబర్చరు. కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ ఇతర కూరగాయలతో పాటు ఇందులో కూడా ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాకరకాయ లో ఉండే అనేక పోషకాలు మీ శరీరాన్ని అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. కాకరకాయ అనేక విధాలుగా వంటల్లో వినియోగిస్తారు. అయితే కాకరకాయ, నిమ్మరసం జ్యూస్ లాగా చేసుకొని తాగవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాకర కాయ, నిమ్మ రసం కలిపిన జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తయారు చేసుకొనే విధానం:
కాకరకాయ పైన ఉన్న తొక్కతీసి, కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. ఈ మిశ్రమంలో కి అర చెక్క నిమ్మరసం పిండి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య తో బాధపడేవారికి ఈ జ్యూస్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఒకసారి మధుమేహ వ్యాధికి గురయ్యారు అంటే, జీవితాంతం ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది. దీనిని నియంత్రించడం తప్ప నివారించే మార్గాలు పూర్తి స్థాయిలో లేవు. డయాబెటిక్ ను అదుపులో ఉంచడానికి మందులు వాడుతూ తగిన ఆహారం తీసుకోవాలి. కాకర లో ఉండే పాలిపెప్టైడ్ పి అనేది ఇన్సులిన్ గా పని చేసి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. శరీరం గడ్డలు, వాపుల బారిని పడకుండా కాపాడుతుంది.
ఈ జ్యూస్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ గుండె సమస్యలను నివారిస్తుంది. కాకరకాయ, నిమ్మరసం కలిపి పి తాగడం వల్ల కాలేయం శుభ్రం చేయడమే కాకుండా, రక్తం కూడా శుద్ధి అవుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో వచ్చే మార్పు లను నివారిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్న భోజనం తర్వాత ఈ జ్యూస్ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.