Samantha : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు ఏ రేంజ్ బిజీగా ఉందో చూస్తూనే ఉన్నాము. తన కెరీర్ లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయి సాలీడ్ ఆఫర్స్ తో సమంతా దూసుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఈమెకి లేకపోవడంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ తెలుగు తమిళ్ బాలీవుడ్ సహా ఇంగ్లీష్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
మరి రీసెంట్ గానే సమంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” లో అసలు ఊహించని రేంజ్ ఐటెం సాంగ్ ని చేసి షాకిచ్చింది. ఈ సాంగ్ లో తాను చూపించిన హాట్ షో ఇప్పటికీ కూడా టాలీవుడ్ హిందీ వర్గాల్లో హాట్ సెన్సేషన్ గా నిలిచి కొనసాగుతుంది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సమంతా మరో భారీ సినిమాలో హాట్ ఐటెం గర్ల్ గా కనిపించనుంది అంటూ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకి వచ్చింది. మరి ఆ సినిమా మరెవరితోనో కాదట డాషింగ్ అండ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా కోసం అన్నట్టు తెలుస్తుంది.
తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా “లైగర్” లో ఓ సాంగ్ కోసం గాను ఆమెను సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్టే తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.