Rani Mukerji: ‘మర్దానీ3’ను సిల్వర్ స్క్రీన్‌పై వీక్షించ‌టానికి ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న స్టార్ హీరోయిన్

ఇండియ‌న్ ఫిల్మ్స్ ఐకానిక్ ఆలియా భ‌ట్‌.. బాలీవుడ్‌లో 30 ఏళ్ల స‌క్సెస్‌ఫుల్ సినీ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటోన్న‌ ప్ర‌ముఖ హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసింది. ‘మ‌ర్దానీ 3’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణీ ముఖ‌ర్జీ న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆలియా భ‌ట్ ఈ సినిమాను చూడటానికి తానెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్నాన‌నే విష‌యాన్ని తెలియ‌జేసింది. అంద‌రూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు.

‘30 సంవత్స‌రాలు మ‌ర‌పురాని పెర్ఫామెన్స్‌లు.. ఇప్పుడు మ‌రోటి. ‘మ‌ర్దానీ 3’ని చూడ‌టానికి చాలా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నా’ అని ఆలియా భ‌ట్ పేర్కొంది. దీంతో బాలీవుడ్‌లో ఆమె మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణం గురించి మ‌రోసారి తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, అనీల్ క‌పూర్‌, రియా క‌పూర్ వంటి స్టార్స్ అంద‌రూ రాణీ ముఖ‌ర్జీ అద్బుతమైన న‌టిగా, తిరుగులేని లెగ‌సీని అభినందించారు.

అయుష్మాన్ ఖురానా స్పందిస్తూ..‘‘30 సంవ‌త్స‌రాలుగా తిరుగులేని సినీ వార‌స‌త్వం..ఇంకా మీ నుంచి మ‌రిన్ని గొప్ప సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నాను. మీరు ఈ ప్ర‌కృతి యొక్క శ‌క్తి.. మీ వ‌ర్క్‌ను చూసి నేనెంతో ఇన్‌స్పైర్ అయ్యాను. ఇంత మంచి సినిమాలు, జ్ఞాప‌కాల‌ను అందించినందుకు ధ‌న్య‌వాదాలు.. ల‌వ్ యూ’’ అన్నారు.

అనీల్ క‌పూర్ రియాక్ట్ అవుతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నంతో ముందుకు వెళ్లే ఈ సినీ ప‌రిశ్ర‌మ‌లో 30 సంవత్స‌రాలు ప్ర‌యాణం అంటే మామూలు విష‌యం కాదు. అంద‌రూ ఇష్ట‌ప‌డే,అభిమానించే న‌టిగా, ఫ్రెండ్‌గా, వ్య‌క్తిగా అద్భుతంగా రాణిస్తున్నారు. మీ గొప్ప ప్ర‌యాణానికి మీకు అభినంద‌న‌లు. త్వ‌ర‌లో రాబోతున్న మ‌ర్దానీ 3 కోసం నా అభినంద‌న‌లు. ప‌వ‌ర్‌ఫుల్ శివానీ శివాజీ రాయ్ మ‌ళ్లీ మా ముందుకు రాబోతుండ‌టం థ్రిల్లింగ్‌గా ఉంది. మ‌ర్దానీ 3 కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

“30 సంవత్సరాల శక్తివంతమైన నటన, ప్రతి రోజు మరింత బలంగా సాగుతూ, నా అసామాన్యమైన స్నేహితురాలు రాణీకి అభినందనలు. మర్దానీ 3లో మరొక శక్తివంతమైన ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను.”

నిర్మాత రియా కపూర్ స్పందిస్తూ..‘‘నా గొప్ప స్నేహితురాలు రాణీకి అభినందనలు. 30 సంవత్సరాలు మెప్పించిన ఈ శ‌క్తివంత‌మైన న‌ట‌న రోజు రోజుకీ బ‌లంగా సాగుతోంది. మర్దానీ 3లో ఈ ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

విశ్వ‌స‌నీయ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌ర్దానీ సినిమాను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ రాణీ ముఖ‌ర్జీ ఈ లెగ‌సీని ఏడాది పాటు ఓ కార్య‌క్ర‌మంలా నిర్వ‌హించ‌టానికి ప్లాన్ చేశారు. ఇవి మ‌ర్దానీ 3 ప్ర‌మోష‌న్స్‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో రాణి..ఆరేడు నగరాలను సందర్శించి..భారత సినీ రంగంలో ఆమె కృషిని సెలబ్రేట్ చేసే పెద్ద సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో రాణీ ముఖ‌ర్జీ టీనేజ్‌లో ప్ర‌వేశించి త‌న అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో శాశ్వ‌తంగా నిలిచిపోయేలా అద్బుత‌మైన సినిమాల్లో నటించారు.

* ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 30న ‘మ‌ర్దానీ 3’ రిలీజ్ కానుంఇ.

RK Podcast With NEXTGEN CEO Dr  Koteswara Rao Padamati PROMO || Aviation Academy || Telugu Rajyam