NTR : విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఆనందించండి: అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్

NTR: మార్చి 25 ఆర్ఆర్ఆర్ డే అని చెప్పాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆర్‌ఆర్ఆర్ మూవీతో నయా రికార్డ్స్ నమోదు కావడం ఖాయం అంటున్నారు. దాదాపు 3ఏళ్ల సుధీర్ఘ వెయిటింగ్ తర్వాత విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. బలమైన ఎమోషన్స్‌కి గూస్ బంప్స్ కలిగించే ఎన్నో యాక్షన్ సన్నవేశాలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ఫెక్షన్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని రాజమౌళి, మళ్లీ తన అన్ బిలీవబుల్ టాలెంట్‌ను దేశానికి చూపించి, మరో ఘనత సాధించాడు. చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాలు తీయడం ఆయనకే చెల్లిందంటూ ఇప్పటికే ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మీ వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు. అవే నన్ను మరింత ముందుకు తీసుకెళ్తాయి. విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసి ఆనందించండి… అంటూ ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇకపోతే హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో తన ఫ్యామిలీతో కలిసి సినిమాను వీక్షించిన ఎన్టీఆర్, ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ హిట్, మాటల్లేవ్ అంటూ తన అభిమానులు ఇచ్చిన రియాక్షన్‌ చూసి ఆయన ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా RRRలో ఎన్టీఆర్- కొమరం భీమ్‌గా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించి అలరించగా, అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్స్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇక అజయ్ దేవ్‌గణ్ కొద్దిసేపే స్క్రీన్‌పై కనిపించినా తన పాత్రకు ఆయన న్యాయం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో నిర్మించారు.