Ear Wax: మాటి మాటికి చెవిలో ఇయర్ బడ్ పెట్టి శుభ్రం చేస్తున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే…!

Ear Wax: మనం ఏదైనా శబ్దాలను వినాలన్న చెవులు కీలకపాత్ర పోషిస్తాయి. చెవిలో ఏ మాత్రం సమస్య ఉన్న మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది తరచూ చెవిలో ఇయర్ బర్డ్ సహాయం లేదా పిన్నీసు సహాయంతో చెవిలో ఉన్న గులిమి శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా శుభ్రం చేయకపోతే చెవులు దెబ్బతింటాయని చాలా మంది భావిస్తూ నిరంతరం ఈ విధంగా శుభ్రం చేస్తుంటారు. అయితే ఇది పూర్తిగా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. మన చెవిలో గులిమి మన చెవిని కాపాడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన చెవికీ అవసరానికి మించి గులిమి ఉత్పత్తి అయితే చెవి దానిని బయటికి పంపుతుందని అంతేతప్ప మాటకి పిన్నీసు పెట్టి శుభ్రం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా గులిమి ఉండటమాయిశ్చరైజర్చి వెళ్లే చిన్న చిన్న పురుగు క్రిమికీటకాలు గులిమి అతుక్కొని పోతాయి.గులిమికి మైనపు స్వభావం ఉంటుంది కనుక క్రిమికీటకాలను చెవిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అందుకే తరచూ గులిమి తీయకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా తరచూ పిన్నీసు సహాయంతో గులిమి తీయడం వల్ల ఇయర్ డ్రమ్ దెబ్బతిని పూర్తిగా వినికిడి లోపం ఏర్పడుతుంది.అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే తరచూ శుభ్రం చేయకూడదని, ఇది చెవికి ఒక మాయిశ్చరైజర్ల పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక చెవిలో కొత్త గులిమి ఏర్పడగానే పాత గులిమి దానంతట అదే బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.