పదేపదే యూరిన్ కు వెళ్తున్నారా.. మీకు కచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం అనే సమస్య చాలామందిని వేధిస్తోంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్, లేదా మూత్రాశయం సంబంధిత సమస్యలు ఇందుకు సంబంధించిన ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. తరచుగా యూరిన్ కి వెళ్తున్నట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు మీకు సరైన పరీక్షలు చేసి, కారణం ఏమిటో నిర్ధారించి, తగిన చికిత్సను సూచిస్తారు.

సాధారణంగా, ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 7 సార్లు యూరిన్ కి వెళ్తాడు. కొన్నిసార్లు యూరిన్ రంగు ఆధారంగా కూడా ఏవైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూరిన్ కి వెళ్ళేటప్పుడు నొప్పి, కాలి నొప్పి, లేదా జ్వరం వంటివి ఉన్నాయా? అనే విషయాలను సైతం గమనించాలి. మీరు ఎక్కువ నీరు తాగుతున్నారా, లేక కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకుంటున్నారా? అనే విషయాలను సైతం పరిశీలించుకోవాలి.

ప్రధానంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఫైబర్‌ అధికంగా ఉండే వాల్‌నట్స్, కిస్‌మిస్‌లు ఈ సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం పిల్లల పెరుగుదలకు సహాయపడతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారికి అరటిపండ్లు తినిపించాలి. ఇది జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందించడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధిస్తుంది. తులసి ఆకుల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. యూరిన్ వస్తున్న ఫీలింగ్ కలిగితే వాష్ రూమ్ కు వెళ్లాలి.

కొన్ని అరుదైన సందర్భాల్లో గుండె వైఫల్యంతో సంబంధం ఉన్న ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కూడా మూత్రం ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల కూడా మీరు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి వివిధ వ్యాధులు, చికిత్సలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. మీకు తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటే లేదా దానితో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను మీరు గమనించినట్టైతే హాస్పటల్ కు వెళ్లండి. అయితే తరచూ మూత్రం వస్తుంది కదా అని మీకు మీరే నిర్దారించుకోకండి. హస్పటల్ కు వెళ్లినాకనే దీని నిర్దారించుకోండి.