ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చాలా ప్రమాదం.. ఈ విషయాలు మీకు తెలుసా?

ముఖంపై కొన్ని లక్షణాలు కనిపిస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. ముఖంపై బలహీనత, పక్షవాతం, కనురెప్పలు సరిగ్గా మూయకపోవడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మాట్లాడటం, తినడంలో ఇబ్బంది, ముఖ కవళికలు కోల్పోవడం, దవడ లేదా చెవి చుట్టూ నొప్పి లేదా అసౌకర్యం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ముఖం యొక్క ఒక వైపు లేదా రెండు వైపులా అకస్మాత్తుగా బలహీనత లేదా పక్షవాతం రావడం, ముఖం పడిపోవడం, ముఖ కవళికలు కోల్పోవడం, మాట్లాడటం మరియు తినడంలో ఇబ్బంది, కంటి సమస్యలు మరియు దవడ లేదా చెవి చుట్టూ నొప్పి లేదా అసౌకర్యం వంటివి ముఖ పక్షవాతం లక్షణాలు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం వల్ల ముఖంపై మొటిమలు, పిగ్మంటేషన్ ఎక్కువగా కనిపించవచ్చు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావచ్చు.

ఛాతీలో నొప్పి, ఛాతీపై ఎక్కువ బరువు మోపినట్లు అనిపించడం, మంట, అది క్రమంగా చేతుల్లోకీ విస్తరించడం వంటి లక్షణాలు గుండె సంబంధిత సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. ముఖంపై ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, పరీక్ష చేయించుకోవడం మంచిది.

మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే.. అప్పుడు కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతుంది. అల్బుమిన్ రక్తంలో ద్రవాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఒకవేళ అల్బుమిన్ తక్కువగా ఉంటే.. ద్రవం రక్తనాళాల నుంచి కణజాలంలోకి లీక్ అవుతుంది. ఫలితంగా మీ ముఖం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణుల  జర్నల్ ఆఫ్ క్లినికల్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లైతే ముఖం ఉబ్బే ప్రమాదం 30 శాతం అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘైలోని జియా టాంగ్ విశ్వవిద్యాలయం అనుబంధిత రుయిజిన్ ఆసుపత్రిలోని హెపటాలజీ విభాగంలో ప్రొఫెసర్​ డాక్టర్​ డేవిడ్ లీ పాల్గొన్నారు.