ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అనే సంగతి తెలిసిందే. చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశాలు ఉంటాయి. యూరిక్ ఆసిడ్ సమస్య ఉన్నవాళ్లను ఇతర సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. సాధారణంగా మూత్రం ద్వారా శరీరంలోని యూరిక్ యాసిడ్ బయటకు వెళ్తుంది.
అయితే మాంసం, చేపలు, రొయ్యలతో పాటూ మద్యం ఎక్కువగా తీసుకునే వాళ్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటూ మధుమేహం, ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదం లాంటి సమస్యలు వేధిస్తాయి. గుండెలో మంట, అజీర్ణం, వెన్నునొప్పి, విపరీతమైన మంట, శ్వాస సరిగ్గా ఆడకపోవడం లాంటి సమస్యలకు యూరిక్ యాసిడ్ కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సమస్యతో బాధ పడేవారు పప్పు, పనీర్, పాలు, చక్కెర, ఆల్కాహాల్, వేయించిన వస్తువులతో పాటూ టమాటాలను ఎక్కవగా తీసుకోకూడదు. వేప ఆకుల రసం, పెప్పర్ ఆకుల రసం తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. గోఖరును నీటిలో బాగా మరిగించిన తర్వాత చల్లార్చి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
మొక్కజొన్న పొట్టును నీటిలో మరిగించి వడపోసి తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పొట్లకాయ రసంలో 7 తులసి ఆకులు, 5 ఎండు మిర్చిని కలిపి తాగడన్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తులసి, గిలోయ్, వేప, గోధుమ గడ్డి, కలబంద మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం ద్వారా కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు.