Karthika Deepam – Shourya: కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శౌర్య రియల్ లైఫ్ గురించి మీకు తెలుసా?

Karthika Deepam – Shourya: కార్తీక దీపం సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌర్య గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో లో సౌర్య దీప కూతురిగా కనిపిస్తున్న శౌర్య అసలు పేరు క్రితిక. క్రితిక 2017 లో బెస్ట్ చైల్డ్ అవార్డ్ ను అందుకుంది. రీసెంట్ గా తన పుట్టిన రోజును కొంత మంది అనాథ పిల్లలతో కలిసి జరుపుకుంది.

ఇక ప్రస్తుతం బావ మరదలు, అక్క మొగుడు, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహ అనే సినిమాలో చైల్డ్ రోల్ లో కనిపించింది క్రితిక. ఆ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

అంతే కాకుండా ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా క్రితిక ఛాన్స్ కొట్టేసింది. 2017లో సుమ యాంకర్ గా చేసిన స్టార్ మహిళ అనే ప్రోగ్రాంలో క్రితిక పార్టిసిపేట్ చేసింది.

ఇకపోతే రాక్షసి అనే సినిమాలో కృతిక ఒక విభిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా 2017 జూన్ లో రిలీజైంది. గోపికమ్మ, దేవయాని లాంటి సీరియల్స్ లో కూడా క్రితిక నటించింది. అంతే కాకుండా ఆమెకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి 2016లో బిగ్ బజార్ వారు చిల్డ్రన్ డే సందర్భంగా ఈమెను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. జీ తెలుగులో ప్రసారమైన గీతాంజలి సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అయింది క్రితిక. ఇలా చిన్నవయసులోనే ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.