హీరో ప్రశాంత్ సినీ జీవితం, నిజజీవితం నాశనం కావడానికి ఆయనే కారణమా!

హీరో ప్రశాంత్ దక్షిణ భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించడం జరిగింది. ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కు 1973లో చెన్నైలో జన్మించాడు.

వైరాగి పోరంతచు అనే తమిళ సినిమా ద్వారా 17 సంవత్సరాల వయసులోనే నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తరువాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వాణ వాణ పుక్కల్ సినిమాలో నటించాడు. ఆర్కె. సెల్వమణి దర్శకత్వం వహించిన చెంబరుతి. మణిరత్నం దర్శకత్వం వహించిన తిరుడా తిరుడా లో నటించాడు.

ఇక 1998లో వచ్చిన ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో తన సరసన ఐశ్వర్యరాయ్ నటించారు. ఇందులో చేసిన ద్విపాత్రాభిమానం. అందరూ ప్రేక్షకులను అలరించింది. ఇలా తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్న ప్రశాంత్ సినీ జీవితం కనుమరుగవటానికి తన తండ్రి చేసిన పనులే కారణం అయి ఉండొచ్చని సమాచారం.

మొదట కథ నేనే వినాలి అని, ఇంకా రేమ్యునురేషన్ కూడా తండ్రి డిసైడ్ చేయడం. అడ్వాన్స్ తీసుకున్నాక మొత్తం ఒకేసారి ఇవ్వాలని లేకపోతే షూటింగ్ లో తన కొడుకు నటించడని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. తరువాత రోజాతో ఎఫైర్ నడుపుతున్నాడని , ఇంకా రాధిక చెల్లెలు నిరోషాతో కూడా ప్రేమ వివాహం నడుపుతున్నాడని అనుమానంతో సినిమాలకు దూరం చేశాడు త్యాగరాజన్.

మొత్తం మీద బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ లా మారిపోయింది ప్రశాంత్ నిజ జీవితం. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురితో వివాహం జరిపించాడు త్యాగరాజన్. కానీ వారిద్దరూ బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా, ఏం కొనాలి అనుకున్న చివరికి హనీమూన్ ఎక్కడికి వెళ్లాలి అనేవి మొత్తం తన తండ్రి డిసైడ్ చేసేవాడు. ఇలా ప్రతి విషయంలో తండ్రి జోక్యం చూసి చివరకు భార్య నేను కావాలో మీ తండ్రి కావాలని తేల్చుకొని చెప్పేసింది.

తర్వాత కొంతకాలానికి ప్రశాంత్ విడాకులు ఇచ్చేశాడు. మొత్తం మీద ప్రశాంత్ తండ్రి చాటు బిడ్డ ఏ పని చేయాలన్నా తండ్రిని సంప్రదించకుండా, తండ్రి ప్రమేయం లేకుండా చేసేవాడు కాదు. ఇప్పుడు మరో వ్యాపారవేత కూతురితో వివాహం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.