వాంటెడ్ వంటలక్క.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్?

బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఎంతో మంచి ప్రేక్షకాదారణ పొందిన సీరియల్ కార్తీకదీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా మలయాళ బ్యూటీ ప్రేమి విశ్వనాథ్ దీప పాత్రలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.ఇకపోతే ఈ సీరియల్స్ ద్వారా ఈమె వంటలక్కగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సీరియల్లో ప్రస్తుతం దీప పాత్ర లేకపోవడంతో అభిమానులు సైతం ఈ సీరియల్ చూడలేకపోతున్నాము అంటూ ఎన్నోసార్లు వారి అభిప్రాయాలను తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఏదో ఒక రూపంలో తిరిగి కార్తీకదీపం సీరియల్ లోకి ప్రేమి విశ్వనాథ్ ను తిరిగి తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీరియల్ ద్వారా ఈమె దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా వంటలక్కకు సంబంధించిన ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానుల మనసు దోచుకొని ఈ కార్యక్రమం నుంచి దూరమై పెద్ద నేరం చేసిందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే నేరం చేసి వెళ్లిపోయిన వంటలక్కను పట్టిస్తే పది లక్షల పరిహారం.. వాంటెడ్ వంటలక్క అంటూ ఉన్న పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్ ను ప్రేమి విశ్వనాథ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తెలుగు అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో ఈమె లేని లోటు ఎంతో స్పష్టంగా కనబడుతుంది.అయితే ఈమె తిరిగి ఈ సీరియల్ లో సందడి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.