తధాస్తు దేవతలు నిజంగా ఉన్నారా…వీరి సంచారం ఎప్పుడు,ఎక్కడ ఉంటుందంటే…?

సాధారణంగా అప్పుడప్పుడు మనం అనుకోవడని మాటలను పదేపదే అంటుంటే … అలా అనకూడదు పైన తధాస్తు దేవతలు ఉంటారు అని మన పెద్దలు మనల్ని వారిస్తూ ఉంటారు. మనం పదేపదే ఒక మాట అంటుంటే తధాస్తు దేవతలు తధాస్తు అని అంటే ఆ మాటలు నెరవేరుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ తధాస్తు దేవతలు నిజంగా ఉన్నారా..? ఒకవేళ తధాస్తు దేవతలు ఉండటం నిజమైతే వారు ఇక్కడ ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు అన్న పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని యొక్క అఖండ తేజస్సుని భరించలేక, ఆమె ఒక గుర్రం రూపం ధరించి గురు దేశం వెళ్తుంది. అప్పుడు గురు దేశంలో గుర్రం రూపంలో ఉన్న సంధ్య దేవిని సూర్యుడు చూసి తను కూడా గుర్రం రూపం ధరించి సంధ్య దేవి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరిని అశ్విని దేవతలు,తధాస్తు దేవతలు అని అంటారు. ఈ తధాస్తు దేవతలు వారి యొక్క బంగారు గతంలో సంచరిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో తధాస్తు అనే నామాన్ని చెబుతూ అదే విధంగా వేద మంత్రాలను ఆహ్వానిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.

ఈ తధాస్తు దేవతలు మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాల నుంచి సత్యాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తారు. అంతే కాకుండా నిత్యం పూజలు చేస్తూ, జపం చేసే మంచి ప్రవర్తన ఉన్న వారికి కూడా ఈ తధాస్తు శక్తిని ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వీరు యజ్ఞ యాగాలు చేసే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఇలా యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్న అధిపతులను, యజ్ఞ ద్రవ్యాలను మంచు బెత్తంతో తాకి వారిని అనుగ్రహిస్తారు.