మనకి వచ్చే కలల గురించి ఇతరులతో చెప్పవచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే..?

మన హిందూ సంస్కృతిలో స్వప్న శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మనిషి నిద్రిస్తున్న సమయంలో అప్పుడప్పుడు కలలు రావడం సహజం. కొన్ని సందర్భాలలో మంచి కలలు వస్తే మరి కొన్ని సందర్భాలలో పీడకలలు వస్తూ ఉంటాయి. వాస్తవానికి కలలు రావటం అనేది మన ఆధీనంలో ఉండదు. మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తాము అలాగే ఎక్కువ సమయం ఎవరితోనైనా గడిపితే అందుకు సంబంధించిన కలలు వస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఇలా కలలు వచ్చినప్పుడు వాటి గురించి ఇతరులతో చెబుతూ ఉంటారు. అయితే ఇలా మనకి వచ్చిన కళల గురించి ఇతరులతో చెప్పటం సరైన పద్ధతి కాదని స్వప్న శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా కొన్ని సందర్భాలలో మనకు పీడకలలు వస్తూ ఉంటాయి. మన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగినట్లు లేదా ఎవరైనా చనిపోయినట్లు కొన్ని సందర్భాలలో కలలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరికొన్ని సందర్భాలలో మనం చనిపోయినట్టు మనకే భయంకరమైన కల వస్తూ ఉంటుంది. అయితే ఇలా మనం చనిపోయినట్లు మనకే కళ రావటంతో చాలామంది భయపడుతూ ఉంటారు జీవితంలో మనం కూడా ఇలాగే చనిపోతామని చావు భయం వేటాడుతూ ఉంటుంది. కానీ ఇలా మనం చనిపోయినట్లు మనకే కల రావడం శుభ సూచకమే అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల రావటం అనేది మనకి మంచి జరగబోతోంది అని తెలిపే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు . అందువల్ల ఇలాంటి కల వచ్చినప్పుడు ఎవరితోనూ చెప్పకూడదు.

కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్లు కొంతమందికి కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కల కూడా మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కలను కూడా ఎవరితో పంచుకోవద్దని అలా పంచుకుంటే ప్రయోజనం పొందలేరని చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాలలో కలలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇలా దేవుళ్ళ గురించి కల రావటం అనేది కూడా మన జీవితంలో మంచి జరగబోతుందని తెలిపే ఒక సంకేతం. ఇలాంటి కల వస్తే కెరియర్ పరంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కల కూడా ఎవరికీ చెప్పకూడదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.