Solar Eclipse: సాధారణంగా పౌర్ణమి అమావాస్య రోజులలో గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడగా, అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొట్టమొదటి సూర్యగ్రహణం ఈనెల 30వ తేదీ ఏర్పడనుంది. భూమికి సూర్యుడికి మధ్య అడ్డుగా చంద్రుడు వచ్చినప్పుడు మనకు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా పాక్షికంగా ఏర్పడనున్నట్లు పండితులు చెబుతున్నారు.మరి సూర్య గ్రహణం ఏ సమయానికి ఏర్పడుతుంది సూర్య గ్రహణం రోజు ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
భారత కాలమాన ప్రకారం సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4:7 గంటల వరకు కొనసాగుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపించడంతో పాటు ఇతర దేశాలు అయినా అట్లాంటిక్, ఆర్కిటిక్ దేశాలతోపాటు దక్షిణ-పశ్చిమ అమెరికాలో కూడా ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక సూర్యగ్రహణం రోజు ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు.
అలాగే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఇష్టదైవారాధన చేసుకోవాలి. పూజ గదిని మూసి వేయడంతో పాటు ఆహార పదార్థాలు అన్నింటిపై కూడా గరిక వేయాలి. ఇక ఈ గ్రహణ సమయంలో పొరపాటున కూడా పదునైన వస్తువులతో పనులు చేయకూడదు. గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయటం మంచిది కాదు.అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇతరుల మాదిరిగా ఉపవాసం ఉండకూడదు. వీలైనంత వరకు పళ్లరసాలు తీసుకోవడం మంచిది.