Surya Arghya Niyam: సూర్యుడికి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలు కలిగిన నీటితో అర్ఘ్యం ఇస్తే.. లక్ష్మీదేవి మీ వెంటే!

Surya Arghya Niyam: ఈ సమస్త జీవకోటి రాశులకు సూర్యుడు ప్రాణాధారం అనే విషయం మనకు తెలిసిందే. అందుకే సూర్య దేవుడిని ఆది దేవుడు అని కూడా పిలుస్తారు. అదేవిధంగా సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తారు. అందుకే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పెద్దలు భావిస్తుంటారు. అయితే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి కూడా ఓ ప్రత్యేకమైన నియమ ఉంటుందని ఇలా ఈ నియమాన్ని పాటించి అర్ఘ్యం ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సూర్య దేవుడికి అర్ఘ్యం ఇచ్చిన తరువాత దూప దీపాలతో పసుపుకుంకుమలతో సూర్యుడికి నమస్కారం చేయాలి. మూడుసార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీటిలో ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలను వేసి సూర్యుడికి సమర్పించాలి. ఇలా మూడు సార్లు అర్ఘ్యం సమర్పించిన తరువాత భూదేవికి నమస్కారం చేసుకొని ఓం నమో సూర్యాయ నమః అని మంత్రం చదవాలి.

ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే చాలామంది సూర్యుడికి
అర్ఘ్యం ఉదయం సాయంత్రం ఇస్తుంటారు. కానీ విశేషమైన ఫలితాలను పొందాలంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చుని పండితులు చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.