మీరు కారు లేదా బైక్ లో ప్రయాణిస్తున్నప్పుడు కుక్కలు మీ వెంట పడుతున్నాయా… ఇదే కారణం కావచ్చు!

సాధారణంగా మనం రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కుక్కలు మనం ప్రయాణిస్తున్న వాహనాల వెంట పడుతూ ఉంటాయి. ఇలా కుక్కలు వాహనాల వెంట పడటం ఎంతో ప్రమాదకరమని చెప్పాలి.అయితే కుక్కలు ఇలా కార్లు లేదా బైక్ వెంట పడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కుక్కలు ఎప్పుడూ కూడా తమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్తున్న వాహనాల వెంట పడవు. కుక్కలు ఆ ప్రాంతంలో ఉన్న వాహనాల టైర్లకు వాటి మూత్రంతో మార్క్ చేసుకొని ఉంటాయి.అందుకే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలు వెళ్లినప్పుడు అవి వారి వెంట పడవు.

ఇక ఆ ప్రాంతంలోకి కొత్త వాహనాలు వచ్చిన కుక్కలు వెంట పడుతుంటాయి.ఇలా కుక్కలు వెంట పడటానికి గల కారణం ఆ కొత్తవారి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతోనే వారిని వెంబడిస్తాయి. అదేవిధంగా కొన్ని రకాల వాహనాల రంగులు వాటికి నచ్చని సమయంలో కూడా ఇలా వాహనాల వెంట వెంబడిస్తాయి. అలాగే కొన్ని వాహనాలు పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చినప్పుడు కుక్కలు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వాహనాల వెంట పడుతుంటాయని తెలుస్తుంది.

ఇకపోతే కుక్కలు కొన్నిసార్లు తమ ఉల్లాసం కోసం కూడా ఇలా వాహనాల వెంట పడుతుంటాయి. అయితే కుక్కలు వాహనాల వెంట పడటం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ కొన్నిసార్లు ఇది చాలా ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇలా కుక్కలు వెంబడించినప్పుడు వాహనాలను వేగంగా నడపడం లేదా సడన్ గా బ్రేక్ వేయడం వల్ల బండిలో ఉన్న వ్యక్తుల కింద పడిపోయి ప్రమాదం జరగడం లేదా కుక్కలకి ప్రమాదం జరగడం వంటివి జరుగుతుంటాయి.