#Single: అల్లు అరవింద్ ప్రజెంట్స్, శ్రీ విష్ణు, కార్తీక్ రాజు, #సింగిల్ మే లో రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఈ వేసవిలో తన మోస్ట్ ఎవైటెడ్ మూవీ #సింగిల్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. నిను వీడని నీడను నేనే మూవీ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా #సింగిల్ మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ పోస్టర్ మూవీ హ్యుమర్ నేచర్ ని సూచిస్తుంది, శ్రీ విష్ణు పాత్రను పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్ గా, నైట్ రొమాంటిక్ పర్శన్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రజెంట్ చేస్తోంది.

శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అలరించే వినోదాత్మక చిత్రంగా వుండబోతోందని హామీ ఇస్తోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్. వేల్‌రాజ్, సంగీతం విశాల్ చంద్ర శేఖర్. ఎడిటింగ్ ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.

నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి
బ్యానర్లు: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
డిఓపి: ఆర్ వెల్‌రాజ్
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
డైలాగ్స్: భాను భోగవరపు & నందు సవిరిగాన
ఆర్ట్: చంద్రికా గొర్రెపాటి
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
డైరెక్షన్ టీం: రామ నరేష్ నున్న, ప్రసన్న నెట్టెం, శంకర్ కొత్త, సాయి కిరణ్ కట, సువర్ణ సుంకరి, సందీప్ హర్ష, సుబ్బారెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
మ్యూజిక్ ఆన్: ఆదిత్య మ్యూజిక్

Pawan Kalyan Chandrababu Fidaa Over Raghu Rama Raju At AP Legislature Cultural Programme | TR