శృతి హాసన్ తల్లి సారిక ఆరు రోజులపాటు కారులోనే గడిపారా?

Shruti Haasan Mother: కమల్ హాసన్ మాజీ భార్య, శృతి హాసన్ అక్షర హాసన్ మాతృమూర్తి సారిక హాసన్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె పేరుకే కమల్ హాసన్ భార్య అయినప్పటికీ ఒక స్టార్ హీరో భార్య ఉండాల్సిన హోదాలో మాత్రం సారిక లేదని చెప్పాలి. చిన్నప్పటినుంచి ఈమెతో పాటు తన కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయి.చిన్నతనంలోనే తల్లి తండ్రి విడిపోవడంతో స్కూలు మెట్లు ఎక్కాల్సిన వయసులో స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగి ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఈ విధంగా బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ఈమె 21 సంవత్సరాలు వచ్చే సరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒంటిపై దుస్తులతో తన తల్లిని వదిలి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక సారిక ఆరు రోజులపాటు కారులో కూర్చొని ఆలోచించారట. ఇలా ఆరు రోజులపాటు నిద్రాహారాలు మాని కారులో ఉన్నారని తెలిస్తేనే, ఈమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అర్థమవుతుంది.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారిక 1928 లో ప్రముఖ నటుడు కమలహాసన్ ను వివాహం చేసుకున్నారు.వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన సారిక పూర్తిగా తన నటనకు దూరమయ్యారు.కొన్ని రోజుల పాటు సంతోషంగా గడిపిన హారిక తన భర్త కమలహాసన్ తో మనస్పర్థల కారణంగా 43 సంవత్సరాల వయసులో తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో ముంబై వెళ్లి తిరిగి తన కెరియర్ ప్రారంభించారు.అయితే హీరోయిన్ గా కాకుండా టెక్నీషియన్ గా తన పనులను ప్రారంభించి తన ఇద్దరు బిడ్డల ఆలనా పాలనా చూసుకుంటూ జీవితం గడిపారు.ఇక శృతి హాసన్ అక్షర హాసన్ ప్రస్తుతం నటీమణులుగా తన కెరియర్ ప్రారంభించడంతో ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏది ఏమైనా సారిక జీవితంలో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయని చెప్పాలి.