ప్రస్తుత కాలంలో వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రజలు వారి అవసరాలు, కంఫర్ట్ కి అనుగుణంగా కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేసే దానిని ఉపయోగించడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో కారు బ్రేక్ డౌన్ అవటంవల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కారు బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మనం ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
కారు కొన్న తర్వాత ఇలాంటి బ్రేక్ డౌన్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి మీరు ఈ బ్రేక్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఆయిల్ లెవెల్ ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రెగ్యూలర్ గా బ్రేక్ ఆయిల్ లెవెల్స్ ను తనిఖీ చేయడం ద్వారా కారును బ్రేక్ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించవచ్చు. కారులో బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ అని ఓ చిన్న ట్యాంక్ ఉంటుంది. సాధారణంగా అది మాస్టర్ సిలిండర్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక ప్లాస్టిక్ కంటైనర్. దానిలో ఆయిల్ లెవెల్ చూపించే లైన్స్ కూడా ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు బ్రేక్ పెడల్ నొక్కుతారో ఆ ఒత్తిడిని బ్రేక్ ప్యాడ్లకు, రోటార్ల వరకూ తీసుకెళ్లి రోటార్ తిరగకుండా బ్రేక్ ఆయిల్ చేస్తుంది. ఒక వేళ బ్రేక్ ఆయిల్ లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తుతాయి.
బ్రేక్ ఆయిల్ రిజర్వాయర్ ఆయిల్ కి సంబంధించి మినిమమ్, మాగ్జిమమ్ లెవెల్స్ ను చూపిస్తుంది. బ్రేక్ ఆయిల్ మినిమమ్ లెవెల్ కు వస్తే వెంటనే దానిని పూర్తిగా ఖాళీ చేసి కొత్త ఆయిల్ మాగ్జిమమ్ లెవెల్ వరకూ వేయాలి. అయితే మీ కారు మాన్యువల్ ప్రకారం ఏది మంచిదో దానిని మాత్రమే వినియోగించాలి. అలాగే ఆయిల్ తో ట్యాంక్ ను నింపిన తర్వాత ఆ ట్యాంక్ కి ఏమైనా లీకేజీలు ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా లీకేజీ ఉంటే వాటికి వెంటనే మరమ్మతులు చేసుకోవాలి. ఇలా ఏదైనా ప్రయాణం చేసే ముందు ఈ జాగ్రత్తలు అన్ని పాటించడం వల్ల ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు.