‘పెళ్ళికాని ప్రసాద్’ సినిమాని మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడు సప్తగిరికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను: బ్రహ్మానందం

సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారి మాటలతో నా మనసు బరువెక్కింది. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు. గురువుగారికి పాదాభివందనం. మారుతి అన్న నన్ను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. నా జీవితం మారుతి అన్నతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అండ దండ కొండ లాగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత ఎస్కేన్ గారికి థాంక్యూ. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న హర్షిత్ రెడ్డి గారికి థాంక్యూ. ఎస్విసిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారికి రుణపడి ఉంటాను. దాదాపు ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చాలా అద్భుతంగా తీశాడు చాలా రోజుల తర్వాత నాకు మంచి కంటెంట్ తో ఉన్న సినిమాని ఇచ్చాడు. అభిలాష్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. తనకి ఈ సినిమా చాలా కొత్త జీవితాన్ని ఇస్తుంది. మా నిర్మాతలు చాలా ప్యాషన్ తో పని చేశారు. ప్రమోదిని గారు తన క్యారెక్టర్ లో డామినేట్ చేశారు. ఇకపై ఆమెకు వచ్చే క్యారెక్టర్ లో చాలా మార్పులు వస్తాయి. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా ప్రమోదని గారి యాక్టింగ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో నాకు మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గారికి చాలా మంచి కెమిస్ట్రీ ఉంటుంది.

మా ఇద్దరి క్యారెక్టర్స్ మిమ్మల్ని చాలా అలరిస్తాయి. హీరోయిన్ ప్రియాంక శర్మ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా తర్వాత తనకి మంచి అవకాశాలు వస్తాయి. సినిమా ఫన్ బ్లాస్ట్ లా ఉంటుంది. మార్చ్ 21న థియేటర్స్ కి వస్తున్నాం. మీ గొప్ప మనసుతో ఆదరించాలని కోరుకుంటున్నాను. 100% థియేటర్స్ లో ఆడియన్స్ ని నవ్విస్తాం. 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. కమెడియన్ గా మీ గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేశాను. హీరోగా మంచి సినిమాలు చేశాను. ప్రతిసారి నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసిన యుద్ధంలో ఇండస్ట్రీ, ఆడియన్స్ నాకు అండగా ఉన్నారు. ప్రభాస్ అన్న, వెంకటేష్ గారు, మారుతి అన్న, ఎస్కేన్ గారు దిల్ రాజ్, గారు శిరీష్ గారు, హర్షిత్ అన్న, అనిల్ రావిపూడి అన్న ఇంతమంది గొప్ప వ్యక్తుల బ్లెస్సింగ్స్ మా సినిమాకి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేడుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన జగన్ అన్నకే థాంక్ యూ. ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా గొప్ప సక్సెస్ అవుతుందనే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. సినిమా చూసే ప్రతి ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పెయిడ్ ప్రీమియర్స్ 100% ఫుల్ అవుతున్నాయి. దయచేసి సినిమా చూడండి. బ్లెస్ చేయండి. మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను’అన్నారు

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి రావడానికి ప్రధాన కారణం సప్తగిరి. చిరంజీవి గారు మొన్న బ్రహ్మ ఆనందం ఈవెంట్ కి ఇన్విటేషన్ లేకుండానే నేనే వస్తానని వచ్చారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. రీసెంట్ గా ఆ విషయం నేర్చుకున్నాను కాబట్టే ఈ వేడుకకి ఏ ఇన్విటేషన్ లేకుండా వచ్చాను. తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. తమ్ముడు కంటే ఒక హాస్య నటుడు సినిమా హిట్ కావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇన్విటేషన్ అనేది స్నేహితుల మధ్య జరిగేది ఆత్మీయులు మధ్య పిలుపులు ఉండవు. ఈ సినిమా కోసం సప్తగిరి చాలా శ్రమ పడ్డాడు. గత 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు. అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి కనిపించి కనిపించని అందరి దేవుళ్ళని మొక్కుకున్నాడు. విజయం సాధిస్తే సినిమాని నమ్ముకుని వచ్చిన నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతాను అని చెప్పాడు. ఈ మాట మీతో పంచుకోవాలని ఈ వేడుకకు వచ్చాను. ప్రేక్షకుల్ని పదికాలాలపాటు నవ్వించాలనే తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడుది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఉంది. తనని అప్పా అని పిలుస్తాను. ట్రైలర్లో ఆమెని చూశాక ఒక 40 ఏళ్ల జర్నీ గుర్తుకొచ్చింది. పెళ్ళికాని ప్రసాద్ సినిమాని మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా మంచి హిట్ అయి ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి వచ్చిన సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఇదే మార్చిలో ఈ రోజుల్లో సినిమా విడుదలై జనాలందరూ గొప్పగా ఆదరించారు. మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడూ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ప్రూవ్ చేశారు. సప్తగిరి హీరోగా చేస్తుంటాడు. కమెడియన్ గా చేస్తుంటాడు. పెళ్లి కాని ప్రసాద్ కథ చాలా బాగుందని తను బిగినింగ్ నుంచి చెప్తూ వచ్చాడు. ఒకరోజు సినిమా చూపించాడు. సినిమా ఫస్ట్ అఫ్ చూసి బాగుంది అని చెప్పాను. సెకండాఫ్ చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. పల్లెటూరి వాతావరణం లో ఒక మంచి కథని రైటర్స్ చాలా అద్భుతంగా రాశారు. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ట్రెండీగా ఉంది. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే సినిమా. ఇది సినిమాలో కంటెంట్ హీరో అని నమ్మి వెళితే ఈ సమ్మర్ లో ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. బ్రహ్మానందం గారికి థాంక్యూ. ఆయనతో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా థాంక్ యూ’ అన్నారు

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారికి మారుతి గారికి హర్షిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా సినిమాని బ్లెస్స్ చేసినందుకు చాలా థాంక్యూ. మార్చి 21న సినిమా రిలీజ్ కానుంది అందరూ థియేటర్స్ లో తప్పకుండా చూడండి’అన్నారు

అనంతపురం జగన్ మాట్లాడుతూ… అందరికీ ధన్యవాదాలు. వినోదాన్ని పెంచి ఆరోగ్యాన్ని కలిగించే ఆర్టిస్టులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అది మనందరికీ గర్వకారణం. సప్తగిరి గారు అందరు హీరోలతో ఆర్టిస్ట్ గా చేశారు. అందరివాడు ఆత్మీయుడు. పెళ్లికాని ప్రసాద్ సినిమా అందర్నీ అలరించి గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో నిలబడడానికి ఇతను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో మరో 20 ఏళ్లు నిలబడతాడు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’అన్నారు

ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ.. లెజెండరీ బ్రహ్మానందం గారు ఈవెంట్ కొచ్చి బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎన్నో జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్. సప్తగిరి హాస్యం చాలా బాగుంటుంది. ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు ఆయనతో చాలా సినిమాలు చేశాం. తను పెళ్లికాని ప్రసాద్ సినిమా గురించి చాలా నమ్మకంగా చెప్పాడు. సినిమా సౌండ్ చేసే టైం వచ్చింది. మార్చి 21న సినిమా రిలీజ్ కాబోతుంది. ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే కచ్చితంగా సినిమా చాలా పెద్ద సౌండ్ చేస్తుంది. సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి. నా వంతుగా నా ఫ్రెండ్ సర్కిల్లో నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ ట్రిపుల్ ఏ లో షో వేస్తాను. ఇలాంటి సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రతి వారం ఒక హిట్టు వస్తే ధియేటర్స్ కి ఎగ్జిబిషన్ కి అందరికీ బాగుంటుంది.అందరికీ థాంక్యు’అన్నారు

ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈనెల 21న ఎస్విసి ద్వారా రిలీజ్ కానుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. చూసినవారు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్జామ్ టైం కాబట్టి మంచి స్ట్రెస్ బస్టర్ గా ఉంటుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి సప్తగిరి గారు చేసిన ఈ మంచి ఎంటర్టైనర్ ని చూడాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు

డైరెక్టర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారికి మారుతి గారికి ఎస్కే గారికి హర్షిత్ గారికి ధన్యవాదాలు. సప్తగిరి ఈ సినిమాని మాకు చూపించారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేమ కథ చిత్రం గుర్తుకొచ్చింది. అందులో ఎంత బాగా నటించాడో దానికి డబల్ నవ్వులు ఈ సినిమాలో ఉన్నాయి. రెండున్నర గంటలకు పాటు నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉన్నాడు. ప్రేమకథాచిత్రం లవర్స్ సినిమాలు తర్వాత సప్తగిరి కామెడీ ఆ రేంజ్ లో చూసింది ఈ సినిమాలోనే. తప్పకుండా థియేటర్స్ లో చూడదగ్గ సినిమా ఇది అందరూ థియేటర్స్ చూసి ఎంజాయ్ చేయండి’అన్నారు

హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారికి మారుతి గారికి నిర్మాత ఎస్ కే ఎన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ అభిలాష్ గారి బ్లాక్ బస్టర్ జర్నీ ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ కాబోతుంది. మా నిర్మాతలు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సప్తగిరి గారి ఎనర్జీ ఫ్యాషన్ పాజిటివిటీ అద్భుతం. నాకు చాలా స్ఫూర్తినిచ్చేయి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 21న ఈ సినిమాని ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చాలా హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీశాం. మీ అందరినీ అలరిస్తుందని నమ్మకం ఉంది’అన్నారు

యాక్టర్ ప్రమోదిని మాట్లాడుతూ.. మార్చి 21న పెళ్లికాని ప్రసాద్ సినిమా వస్తుంది ఫ్యామిలీ అంతా హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి సప్తగిరి గారికి అందరికీ థాంక్యు వెరీ మచ్.’అన్నారు

యాక్టర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెళ్ళికాని ప్రసాద్ సినిమా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. అందరూ వెళ్లి చూడండి ప్రసాద్ కి పెళ్లి ఎందుకు కాలేదు తెలుస్తుంది. సినిమాల్లో ప్రతి సీన్ నవ్వుతూనే ఉంటారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. మేమంతా చక్కగా పెర్ఫాం చేశాం. తప్పకుండా మీరు థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’అన్నారు

యాక్టర్ శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి నవ్వు చాలా అవసరం. అలాంటి నవ్వులు పంచే మా పెళ్ళికాని ప్రసాద్ చాలా మంచి హాస్యమున్న సినిమా. చాలా హాయిగా నవ్వుకుంటారు. ఈ సినిమాలో నేను చాలా చిత్రమైన పాత్ర వేశాను తప్పకుండా సినిమా మీ అందరిని అలరిస్తుంది’అన్నారు.

ప్రొడ్యూసర్ కేవై బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. బ్రహ్మానందం గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మారుతి గారికి మా కృతజ్ఞతలు. పెళ్ళికాని ప్రసాద్ మార్చ్ 21న రిలీజ్ కాబోతుంది మీరంతా కడుపుబ్బాని అవుతారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.