Vaishnavi Chaitanya: వైష్ణవి సంచలన రిప్లై.. SKN వివాదం ఇక ముగిసిందా?

సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వివాదాలుగా మారడం కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. హీరోయిన్ల ఎంపికపై తన అనుభవాన్ని పంచుకుంటూ, “తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అర్థమైంది, ఇకపై తెలుగురాని అమ్మాయిలను ప్రోత్సహిస్తా” అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, నెటిజన్లు ఈ కామెంట్స్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేసినట్లుగా అనుకున్నారు.

ఈ వివాదంపై వైష్ణవి చైతన్య తాజాగా స్పందించింది. తన కొత్త సినిమా జాక్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా, “ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు మీ గురించేనా?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సూటిగా స్పందిస్తూ, “ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు. నాకు సంబంధం లేదని ఆయనే వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. నన్ను టార్గెట్‌ చేస్తూ అన్న వ్యాఖ్యలు కాదు కాబట్టి, నేను దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో వైష్ణవి ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో, ఆయన కూడా ఇప్పటికే వివరణ ఇచ్చాడు. ఆ మాటలు సరదాగా అన్నవేనని, దాన్ని తప్పుగా అన్వయించుకోవద్దని చెప్పారు. అంతేకాదు, ఇప్పటి వరకు 8 మంది తెలుగమ్మాయిలను పరిశ్రమకు పరిచయం చేసిన విషయం గుర్తు చేస్తూ, తనకు తెలుగమ్మాయిలనే ప్రోత్సహించాలనే లక్ష్యముందని వెల్లడించాడు. నిర్మాత క్లారిటీ ఇచ్చినప్పటికీ, చర్చ తగ్గలేదు. కానీ ఇప్పుడు వైష్ణవి కూడా తన వైపు నుంచి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపు పలకవచ్చని భావిస్తున్నారు.

Women Fire On CM Chandrababu & Pawan Kalyan Ruling || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam