ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తన కుటుంబానికి తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొని రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 18.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నటువంటి అల్లు అర్జున్ కేవలం ఒకే ఒక వ్యక్తిని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ఎవరిని ఫాలో అవుతున్నారనే విషయానికి వస్తే తన భార్య స్నేహారెడ్డి మాత్రమే అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారు. ఇకస్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఏకంగా హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 500 మందిని ఫాలో అవుతున్నారు. ఇలా 500 మంది ఫాలో అయ్యే స్నేహరెడ్డి ఇంస్టాగ్రామ్ లో 8.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇకపోతే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతూ ఉంటారు. అల్లుఅర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి తన పిల్లల గురించి, కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్ తో బిజీగా కానున్నారు.